Telugu News » Bahubali : బాహుబ‌లిలో ఉప‌యోగించిన త్రిశూల వ్యూహం గురించి మీకు తెలుసా..?

Bahubali : బాహుబ‌లిలో ఉప‌యోగించిన త్రిశూల వ్యూహం గురించి మీకు తెలుసా..?

by Anji

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు ఎంత పెద్ద‌హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసాయి. ఈ సినిమాల రికార్డును ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా కూడా క్రాస్ చేయ‌లేదు. తాజాగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ చేరుకుంది. రికార్డు అలా ప‌క్క‌కు పెడితే.. బాహుబ‌లి సినిమాలో మాహిష్మ‌తి సామ్రాజ్యం కాల‌కేయుల‌తో యుద్ధం చేసిన‌ప్పుడు అనుస‌రించిన త్రిశూల వ్యూహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ads


ముఖ్యంగా త్రిశూల వ్యూహం అనేది మ‌హాభార‌తంలో చెప్ప‌బ‌డిన 12 యుద్ధాల్లో ఒక‌టి. చ‌క్ర‌వ్యూహం, ప‌ద్మ‌వ్యూహం వంటి వ్యూహాల్లో త్రిశూల వ్యూహం ఒక‌టి. దీనిని స‌రిగ్గా ఉంచాలాలే కానీ.. శత్రురాజ్యం ఎంత పెద్ద భారీ సైన్యం ఉన్నా సుల‌భంగా విజ‌యం సాధించ‌వచ్చు. అందుకే మాహిస్మ‌తి రాజ్యం ఈ వ్యూహాన్ని అనుస‌రించింది. యుద్ధంలో విజ‌యం సాధించింది. కాల‌కేయుల‌కు అంత బుద్ధి జ్ఞానం లేదు. వారు ఇలాంటి వ్యూహాల‌ను అర్థం చేసుకోలేరు. తాము యుద్ధంలో దిగాం కాబ‌ట్టి.. శ‌త్రువుల‌ను చంప‌డ‌మే వారికి తెలుసు. బాహుబ‌లికి, భ‌ళ్లాల దేవుడికి కాల‌కేయుల‌తో యుద్ధం గెల‌వ‌డం సుల‌భ‌త‌రం అయింది. వారు వ్యూహాల‌ను అర్థం చేసుకోలేరు.

మాహిష్మ‌తి రాజ్యం త్రిశూల వ్యూహాన్ని ఎంపిక చేసుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. అది ఏమిటంటే..? మాహిష్మ‌తి రాజ్యంలోకి ప్ర‌వేశింప‌జేసేందుకు ఒక్క‌టే మార్గం ఉంటుంది. అది కూడా ఇరుకైన మార్గం. చుట్టూ కొండ‌లు, న‌దులుంటాయి. క‌నుక ఇరుకైన దారి నుంచే రాజ్యంలోకి రావాలి. దానిని కాపాడుకుంటే చాలు. శ‌త్రువుల‌తో యుద్ధం గెల‌వ‌వ‌చ్చు. అందుకు త్రిశూల వ్యూహం స‌రిగ్గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే మాహిష్మ‌తి రాజ్యం ఆ వ్యూహాన్ని ఎంచుకుంది.

ఈ వ్యూహంలో తిర‌గేసిన వీ ఆకారంలో రాజ్యం దారిని ఒక సైన్యం ర‌క్షిస్తుండాలి. అదే స‌మ‌యంలో దానికి కుడి, ఎడ‌మ వైపుల నుంచి రెండు సైన్యాలు వేర్వేరుగా దూరం నుంచి వెళ్లి తిరిగి శత్రు రాజు వ‌ద్ద క‌లుసుకోవాలి. అప్పుడు రెండు వైపుల నుంచి శ‌త్రు రాజును ముట్ట‌డిస్తారు. దీంతో ఆ రాజుకు ఏమి జ‌రిగేదీ తెలియ‌దు. ఇరువైపుల నుంచి వ‌చ్చిన సైన్యాల‌తో యుద్ధం చేయ‌లేక రాజు ఓడిపోతాడు. దీంతో యుద్ధంలో సుల‌భంగా గెల‌వ‌వ‌చ్చు. ఇలా మాహిష్మృతి వారు సుల‌భంగా త్రిశూల వ్యూహాన్ని అమ‌లు చేశారు. ఈ యుద్ధంలో విజ‌యం సాధించారు. అందుకే భారీ సైన్యం ఉన్న‌ప్ప‌టికీ కాల‌కేయులు ఓడిపోయారు.

త్రిశూల వ్యూహంలో ముఖ్యంగా మూడు సైన్యాలు ప‌క‌డ్భందీగా యుద్ధం చేయాలి. ద్వారం వ‌ద్ద ర‌క్ష‌ణ‌గా ఉండే సైన్యానికి కాప‌లా ఉండే సైన్యాధికారి చాలా ధృడంగా ఉండి శత్రువుల‌ను ఎదుర్కోవాలి. అదేవిధంగా కుడి, ఎడ‌మ‌ల వైపు నుంచి శ‌త్రు రాజు వ‌ద్ద‌కు వెళ్లే సైన్యాలు, వాటి సైన్యాధికారులు కూడా చాలా యోధులు అయి ఉండాలి. అప్పుడే యుద్ధంలో విజ‌యం సాధిస్తారు. బాహుబ‌లిలో ఈ పనిని ముగ్గురూ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. క‌ట్ట‌ప్ప ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద సైన్యంతో శత్రువుల‌ను అడ్డుకుంటే.. బాహుబ‌లి, భ‌ళ్లాల దేవ కాల‌కేయ రాజు వైపున‌కు వారి సైన్యంతో ధైర్యంగా వెళ్లి భీక‌రంగా పోరాడి యుద్ధాన్ని గెలిచారు. వారు త్రిశూల వ్యూహాన్ని స‌రిగ్గా అమ‌లు చేశారు క‌నుక‌నే.. యుద్ధంలో గెలుపొందారు. లేదంటే ఈ వ్యూహాన్ని స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంది. క‌ట్ట‌ప్ప, బాహుబ‌లి భ‌ళ్లాల దేవ అందులో చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ విధంగా త్రిశూల వ్యూహాన్ని పూర్వ‌కాలంలో చాలా యుద్ధాల్లో అమ‌లు చేశార‌ట‌.

ఇవి చ‌ద‌వండి : 

రెండో పెళ్లి చేసుకున్న గెట‌ప్ శ్రీ‌ను.. ఫోటోలు వైర‌ల్‌..!

Anasuya : చిరంజీవిపై అన‌సూయ ఆస‌క్తిక‌ర ట్వీట్‌..!

చైనాలో లాక్‌డౌన్‌.. అల్లాడుతున్న ప్ర‌జ‌లు..!


You may also like