Home » Anasuya : చిరంజీవిపై అన‌సూయ ఆస‌క్తిక‌ర ట్వీట్‌..!

Anasuya : చిరంజీవిపై అన‌సూయ ఆస‌క్తిక‌ర ట్వీట్‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవికి జ‌నాల్లో ఎంత‌టి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌రలేదు. ఈ వ‌య‌స్సులో కూడా చిరంజీవి త‌న అభిమానుల కోసం వ‌రుస సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. తాజాగా చిరంజీవి న‌టించిన చిత్రం ఆచార్య. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆచార్య‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొర‌టాల శివ సినిమాలు బ‌ల‌మైన క‌థ‌తో ఉంటాయి.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ క‌ల‌యిక‌లో వ‌స్తున్న తొలి చిత్రం కావ‌డం విశేషం. నిన్న‌నే ఆచార్య ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. మెగాఫ్యాన్స్ కోరుకునే అంశాల‌తో ట్రైల‌ర్ అదిరిపోయింది. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది ఆచార్య ట్రైల‌ర్‌. మెగాస్టార్ మార్క్ వార్నింగ్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగా హైలెట్ అయ్యాయి. కానీ ఆచార్య ట్రైల‌ర్ విష‌యంలో అభిమానుల నుంచి నెటిజ‌న్ల నుంచి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ట్రైల‌ర్‌లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి వేసిన స్టెప్పులు ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కు క‌న్నుల‌పండువ‌గా అనిపించాయి. ఇందులో చిరు త‌న స్టైల్‌లో సెటైరిక‌ల్‌గా వేసిన చిన్న డైలాగ్‌లు అంద‌రికీ ఎక్కేశాయి. నేనొచ్చాన‌ని చెప్పాల‌నుకున్నా కాలు తీసేయాల‌ట‌. కానీ ఏ కాలా అని అంటూ చిరు చెప్పిన చిన్న‌పాటి డైలాగ్స్ అంర‌దిని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా అన‌సూయ ట్రైల‌ర్‌పై అన‌సూయ రియాక్ట్ అయింది.

Advertisement

వావ్‌.. మీరొచ్చార‌ని చెప్ప‌క్క‌ర్లేదు స‌ర్‌.. మీరు చేస్తూ.. ఉండండి. మేము చూస్తూ ఉంటాం అంటే.. ఎంత నిండుగా ఉందో సినిమా చూడాల‌ని ఎంతో ఆత్రుత‌తో ఉంది. సిద్దా, ఆచార్య అంటూ పులి, చిరుత‌పులి ఎమోజీల‌ను అన‌సూయ షేర్ చేసింది. మొత్తానికి ఆచార్య ట్రైల‌ర్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మిలియ‌న్ల వ్యూస్‌ను కొల్ల‌గొట్టేస్తోంది. ఏప్రిల్ 29న బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు ఆచార్య సిద్ధంగా ఉంది.

 

ఇవి చ‌ద‌వండి : 

ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?

HEMA : సర‌దాగా ప‌బ్ కు వెళ్ల‌డం అల‌వాటే కానీ ఆ ప‌ని చేయ‌ను…హేమ సంచల‌న వ్యాఖ్య‌లు…!

కుక్కలు కరెంట్ స్తంభాలకు ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయో మీకు తెలుసా..!

Visitors Are Also Reading