Home » చైనాలో లాక్‌డౌన్‌.. అల్లాడుతున్న ప్ర‌జ‌లు..!

చైనాలో లాక్‌డౌన్‌.. అల్లాడుతున్న ప్ర‌జ‌లు..!

by Anji
Ad

క‌రోనాకు పుట్టినిల్లు అయిన‌టువంటి చైనాను మ‌హ‌మ్మారి మ‌రోసారి కుదిపేస్తోంది. షాంఘైలో క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. దీంతో ఆక‌లి కేక‌ల‌తో చైనా అల్లాడిపోతుంది. క‌రోనా క‌ఠిన లాక్‌డౌన్‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. తిన‌డానికి తిండి దొర‌క‌డం లేద‌ని అర్త‌నాదాలు చేస్తున్నారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్నా ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిత్యం 20వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆదివారం గ‌రిష్టంగా ఒక్క‌రోజే 25వేల కేసులు రికార్డ‌య్యాయి. మార్చిలో క‌రోనా తీవ్ర‌త పెరిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్షా 70వేల కేసులు వెలుగు చూశాయి.

Advertisement

క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఏప్రిల్ 01 నుంచి షాంఘై మ‌హాన‌గ‌రంలో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తొలుత 5 రోజులే లాక్‌డౌన్ విధిస్తామ‌ని చెప్పిన అధికారులు వైర‌స్ ఉధృతి ఎక్కువ‌వ్వ‌డంతో దానిని కొన‌సాగిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం పెరిగిపోతోంది. ఓ వైపు ఇళ్ల‌కే పరిమితం కావ‌డం.. మ‌రోవైపు నిత్య‌వ‌స‌రాల కొర‌త‌తో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధుల‌కు ఔష‌దాలు పొంద‌డం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా క‌నీసం తిండి కూడా దొర‌క‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న షాంఘై పౌరులు భ‌వ‌నాల కిటికిలు, బాల్క‌నీలోకి వ‌చ్చి పెద్ద‌గా అరుస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

లాక్‌డౌన్ కార‌ణంగా ఆహారం, నిత్య‌వ‌స‌రాల‌ను స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నా వాటి కొర‌త వేధిస్తోంది. సూప‌ర్ మార్కెట్ల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌డ‌మే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు షాంఘై వాసుల ఆక‌లి కేక‌ల‌పై అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలా చేయ‌డం వ‌ల్ల వైర‌స్ మ‌రింత వ్యాపిస్తుంద‌ని చెబుతున్నారు. దీంతో డ్రోన్ల‌ను రంగంలోకి దింపిన అధికారులు.. కోరిక‌ల‌ను నియంత్రించుకోండి. పాట‌లు పాడ‌డానికి కిటికిలు తెర‌వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు.


మ‌రోవైపు వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనా ఐసోలేష‌న్‌లో వైద్యుడు కుప్ప‌కూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేష‌న్ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్న‌ట్టు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మొత్తంగా క‌రోనా మ‌హమ్మారి చైనాలో క‌ల్లోలం సృష్టిస్తోంది.

ఇవి చ‌ద‌వండి : 

HERO NANI : స్టార్ హీరోగా ఎదిగిన నాని…కానీ త‌న‌ పేరెంట్స్ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసా…!

రైల్లో కిటికీలకు ఇనుప కడ్డీలు అడ్డంగా ఎందుకు బిగిస్తారో మీకు తెలుసా..!!

అప్పట్లో ఆ హీరోతో మంచి రిలేషన్ ఉండేదని షాకింగ్ నిజాలు చెప్పిన రాములమ్మ..!

Visitors Are Also Reading