Home » అఖిల్ కు హిట్ కోసం నాగార్జున తపన..జక్కన్నకు అన్ని కోట్లు ఇచ్చాడా..?

అఖిల్ కు హిట్ కోసం నాగార్జున తపన..జక్కన్నకు అన్ని కోట్లు ఇచ్చాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే అక్కినేని ఫ్యామిలీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ. ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం అక్కినేని ఫ్యామిలీ హీరో ఏఎన్నార్ అని చెప్పవచ్చు. అలాంటి ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ కు పరిచయమయ్యారు అక్కినేని నాగార్జున. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటిన సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ఇక నాగార్జున నట వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

వీరు ఏ టైంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టారో ఏమో కనీసం వారికి చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటి కూడా పడడం లేదు. నాగచైతన్య కాస్త కూస్తో పడుతూ లేస్తూ ముందుకు వెళ్తున్నారు, అఖిల్ మాత్రం ఎనిమిది సంవత్సరాలుగా చేసిన ప్రతి సినిమా చాలా దారుణంగా విఫలమవుతూ వచ్చాడు. దీంతో దర్శక, నిర్మాతలు ఆయనతో సినిమా అంటే భయంతో వణికిపోతున్నారు. ఈ తరుణంలో ఆయన సినీ కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఎలాగైనా ఆయనకు ఒక హిట్ కావాలని నాగార్జున గట్టి నిర్ణయం తీసుకున్నారట.

Advertisement

తన కొడుక్కు హిట్ అందించాలని కోరుతూ ఆయన జీవితాన్ని దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో పెట్టారట. దీనికోసం జక్కన్నకు 10 కోట్ల అడ్వాన్స్ కూడా ఆయన ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. దీన్ని స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే అఖిల్ రాజమౌళి కాంబినేషన్ లో మంచి కథతో సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే అక్కినేని అభిమానులకు పండుగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 

Visitors Are Also Reading