Home » పెళ్లి పీటలపై కూర్చున్న జయలలితను మోసం చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

పెళ్లి పీటలపై కూర్చున్న జయలలితను మోసం చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

by Sravanthi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలమైన సినిమాల్లో నటించి తెలుగు సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఆయన మరణించే వరకు హీరో గానే ఉన్నారు తప్ప మరో ఏ క్యారెక్టర్ చేయలేదు. అలాంటి శోభన్ బాబు ఇండస్ట్రీలోనే టాప్ 5 ధనిక హీరోల్లో ఒకరిగా చెప్పవచ్చు. అలాంటి ఆయన అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న జయలలితతో ప్రేమ వ్యవహారం నడిపిన విషయం మనందరికీ తెలుసు. వీరిద్దరూ చెట్టాపట్టా లేసుకొని తిరగడం, ఒకరినొకరు వదిలిపెట్టి ఉండకపోవడం, అలా ఎన్నో జరిగాయి. ఇక జయలలిత శోభన్ బాబును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని కూడా భావించింది. కానీ చివరి క్షణాల్లో ఆమె ఆశలు ఆవిరి అయిపోయాయి.. మరి ఏం జరిగిందో చూద్దామా..

జయలలిత శోభన్ బాబుతో ప్రేమలో పడే కంటే ముందే ఆయనకు పెళ్లయింది. కానీ శోభన్ బాబుకు జయలలిత అంటే ఇష్టం ఉన్నా కానీ పెళ్లి వరకు వచ్చేసరికి వద్దని చెప్పేవారు. తన భార్య అంటే కూడా ఆయనకు అమితమైన ప్రేమ. అందుకే జయలలితను ప్రేమించినా కానీ పెళ్లి చేసుకోలేదు. కానీ జయలలిత శోభన్ బాబును పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టేది. మీ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను భార్యగా చేసుకోవాలని ప్రతి రోజు వేధించేదట.

చివరికి జయలలిత ఒకరోజు ముహూర్తం కూడా ఖరారు చేసి , పెళ్లి చీర, నగలు, వడ్డానం అన్ని పెట్టుకుని పెళ్లికూతురులా రెడీ అయి శోభన్ బాబును రమ్మని చెప్పింది. ఆయన కూడా బయలుదేరి జెమిని స్టూడియో వరకు వచ్చారట. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మళ్లీ జయలలిత ఇంటికి ఫోన్ చేసి నేను రాలేదని క్షమించమని కోరారట. ఇక ఈ సంఘటన తర్వాత జయలలిత బాగా కృంగిపోయి తన కెరియర్ పై దృష్టి పెట్టి మరింత ఎదిగింది. ఈ విధంగా శోభన్ బాబు పై ఎన్నో ఆశలు పెట్టుకొని చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా మిగిలిపోయింది జయలలిత.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 

Visitors Are Also Reading