Home » కీర్తి సురేష్ కు కాబోయే భర్త.. మరి ఇలా ఉన్నాడేంటి.. ఫొటోస్ చూస్తే..!!

కీర్తి సురేష్ కు కాబోయే భర్త.. మరి ఇలా ఉన్నాడేంటి.. ఫొటోస్ చూస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహానటి మూవీ. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించడం కాదు జీవించింది అని చెప్పవచ్చు. ఈ సినిమానే ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది. ఆమె యాక్టింగ్ కు అంతా మంత్రముగ్ధులయ్యారు. అలాంటి కీర్తి సురేష్ తల్లి మేనక కూడా నటి. నాన్న సురేష్ నిర్మాత. ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

Advertisement

జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకొని తన హవా కొనసాగిస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన దసరా సినిమాలో డిగ్లామర్ పాత్రలో నటించి మరోసారి తన టాలెంటును బయటపెట్టింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో తన రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ తో బోలా శంకర్ చిత్రంలో ఆయన చెల్లెలిగా నటిస్తోందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. ఇందులో ఉదయనిది స్టాలిన్ కు జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటించడం మామన్నన్ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

ఇదంతా పక్కన పెడితే ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. 30 ఏళ్లు ఉన్నా ఆమె ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ఓ ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందని సమాచారం అందుతోంది. అతని పేరు పరహాన బీన్ లియాకాత్, ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారట. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా నటి కీర్తి సురేష్ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ కీర్తి సురేష్ కు కాబోయే భర్త అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading