Home » ఇన్ ఫ్లూయెంజాతో ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..!

ఇన్ ఫ్లూయెంజాతో ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..!

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఇన్ ఫ్లూమెంజా కేసులు తగ్గుముఖం దిశగా ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగ్గు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ లో ఈ కేసులు గరిష్టంగా ఉండగా. జనవరి, ఫిబ్రవరి నెలల్లో తగ్గుముఖం పట్టాయని విశ్లేషించింది. దేశంలో ఇన్ ప్లూయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా నిర్వహించిన సమీక్షలో వెల్లడించింది.

Also Read :  స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు ఓ సినిమాలో న‌టించాడ‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?

Advertisement

రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా నమోదు అయిన కేసులతో పాటు ఏయే వయస్సుల వారిపై ఇన్ ప్లూయెంజా ప్రభావం ఎక్కువగా ఉందనే అంశాలను విశ్లేషించారు. సాధారణ శ్వాస సంబంధిత సమస్యలు అత్యధికంగా డిసెంబర్ లో 14,196 కేసులు నమోదు కాగా.. జనవరిలో 13,441 కేసులు, ఫిబ్రవరిలో 11,624 కేసులు నమోదయ్యాయి. ఇక మార్చి నెలలో ఇప్పటివరకు సుమారు 2వేల వరకు నమోదైనట్టు సమచారం. తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో కూడిన ఇన్ ఫ్లూయెంజా పాజిటివ్ కేసులు డిసెంబర్ లో అత్యధికంగా 234 నమోదు అయ్యాయి. జనవరిలో 82, ఫిబ్రవరిలో 82 కేసులు వెలుగులోకి వచ్చాయి. జనవరి 05 నుంచి మార్చి 08 వరకు 206 కేసులు నమోదయ్యాయి. ఈ బాధితులలో అత్యధికంగా 20 నుంచి 29 వరకు ఏళ్ల మధ్య వారు 12.68 % 30-39 Oఏళ్ల వారు 7.8 శాతం 50 నుంచి 59 ఏళ్ల వరకు వారు 6.83 %  ఉన్నట్టు గుర్తించారు.

Advertisement

Also Read :  బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

Manam News

పాటించాల్సిన జాగ్రత్తలు :

  • తుమ్మెటప్పుడు, దగ్గెటప్పుడు ముక్కును కప్పి ఉంచాలి.
  • ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • కళ్లు, ముక్కు, నోటిని చేతితో తాకకూడదు
  • సొంతంగా వైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలి.
  • రద్దీ ప్రదేశాలలో దూరంగా ఉండాలి.
  • ఉపయోగించిన టిష్యూలు, చేతి రుమాళ్లను వాడకూడదు.
  • షేక్ హ్యాండ్ కి దూరంగా ఉండాలి.
  • చల్లని పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

Also Read :  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

Visitors Are Also Reading