Home » ఒక కోరిక తీరకుండానే దాసరి నారాయణ రావు కన్నుమూశారు…ఆ కోరిక ఏంటంటే…!

ఒక కోరిక తీరకుండానే దాసరి నారాయణ రావు కన్నుమూశారు…ఆ కోరిక ఏంటంటే…!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో లో వారసత్వం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పది మంది హీరోలు ఉంటే అందులో 8 మంది వారసత్వంగా వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే టాలెంట్, అదృష్టం లేకుండా కేవలం వారసత్వం మాత్రమే ఉంటే కూడా సరిపోదు. కొండంత టాలెంట్ తో పాటు గోరంత అదృష్టం కూడా కావాలి. అంతే కాకుండా సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి.

Advertisement

 

టాలీవుడ్ లో చాలాంది సీనియర్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో కొంతమంది ప్రస్తుతం ఇండస్ట్రీ ని ఏలుతుండగా మరికొందరు మాత్రం కనుమరుగయ్యాయి. ఆ లిస్ట్ లో ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ కూడా ఉంటాడు. దాసరి నారాయణరావు ఎంతోమంది దర్శకులను, హీరోలను ఇండస్ట్రీ కి పరిచయం చేశారు.

Advertisement

Also Read: Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశికి తోటి వారి స‌ల‌హాలు అనుకూలిస్తాయి

తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం దాసరి నారయణరావు గారే అంటూ మోహన్ బాబు ఇప్పటికీ చెబుతుంటారు. అరుణ్ కుమార్ ను దాసరి హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత అరుణ్ కుమార్ కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఒక్క సినిమా కూడా అరుణ్ కుమార్ కు హీరో ఇమేజ్ తెచ్చిపెట్టలేదు.

అరుణ్ కుమార్ కనీసం నటుడిగా కూడా రానించలేకపోయారు. దాంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఇక తన కుమారుడు సక్సెస్ అవ్వలేకపోయాడు అన్న దిగులు తనకు ఎప్పటికీ ఉండేదని దాసరి ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక చివరికి తన కోరిక తీరకుండానే దాసరి కన్ను మూశారు.

Also Read: సోష‌ల్ మీడియాలో మోక్షాజ్ఞ ఫోటో.. క‌ల‌వ‌ర‌పడుతున్న అభిమానులు..!

Visitors Are Also Reading