Home » సోష‌ల్ మీడియాలో మోక్షాజ్ఞ ఫోటో.. క‌ల‌వ‌ర‌పడుతున్న అభిమానులు..!

సోష‌ల్ మీడియాలో మోక్షాజ్ఞ ఫోటో.. క‌ల‌వ‌ర‌పడుతున్న అభిమానులు..!

by Anji
Ad

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో ఒక‌రైన నంద‌మూరి బాల‌కృష్ణ అఖండ విజ‌యం తరువాత వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి అన్న‌గారు అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.


గోపిచంద్ మ‌లినేని సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడితో క‌లిసి మ‌రో సినిమా చేయ‌నున్నారు బాల‌య్య‌. ఇక ఈ చిత్రంలో 50 ఏళ్లు పైబ‌డిన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు కూతురుగా పెళ్లి సంద‌D బ్యూటి శ్రీ‌లీల న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. తాజాగా బాల‌కృష్ణ ఫ్యామిలీకి చెందిన ఓ ఫోటో బ‌య‌టికొచ్చింది. అందులో భాల‌కృష్ణ భార్య వ‌సుంధ‌ర దేవి, కుమార్తె బ్రాహ్మ‌ణిల‌తో పాటు కుమారుడు మోక్షాజ్ఞ కూడా ఉన్నాడు.

Advertisement

Advertisement

ఇది వ‌ర‌కు కూడా మోక్షాజ్ఞ ఫోటో ఒక‌టి ఇలానే ద‌ర్శ‌న‌మిచ్చింది. అప్పుడు షాకింగ్ లుక్ లో క‌నిపించాడు మోక్షాజ్ఞ. బాల‌కృష్ణ అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ప్ర‌స్తుతం అలా లేక‌పోయినా.. కానీ లావుగానే క‌నిపిస్తున్నాడు మోక్షాజ్ఞ. అభిమానులు మ‌ళ్లీ క‌ర‌వ‌ర‌ప‌డుతున్నారు.ప్ర‌స్తుతం ఇంకా చ‌దువుకుంటూనే ఉన్నాడ‌ని.. సినిమాలోకి వ‌చ్చే వ‌ర‌కు స్లిమ్‌గా, ఫిట్ గా అవుతాడని టాక్ వినిపిస్తోంది. ఇక మ‌రో వైపు బాల‌కృష్ణ హిట్ చిత్రం ఆదిత్య 369కు సీక్వెల్‌తో మోక్షాజ్ఞ ఎంట్రీ ఇస్తాడ‌ని స‌మాచారం. దీనిపై అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Also Read : 

ప్రేమ గురించి హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి ఏమ‌న్న‌దో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాల్లో న‌టించార‌న్న సంగ‌తి తెలుసా…ఆయ‌న నటించిన‌ సినిమాలివే…!

Visitors Are Also Reading