Home » లెజెండ్ నుంచి వీరసింహారెడ్డి వరకు బాలయ్య నటించిన 10 సినిమాల కలెక్షన్లు ఇవే..!

లెజెండ్ నుంచి వీరసింహారెడ్డి వరకు బాలయ్య నటించిన 10 సినిమాల కలెక్షన్లు ఇవే..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఎన్టీఆర్ వారసులుగా కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలయ్య తప్ప ఇంకా ఎవ్వరూ కూడా అంతగా రాణించలేకపోయారనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల పరంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకునేవారో బాలయ్య కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. సినిమాల ఇప్పటివరకు ఎన్టీఆర్ మాదిరిగానే అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు. అందుకే ఈయన స్టార్ హీరోగా నిలబడగలిగారు. మరోవైపు కొంత మంది దర్శకులు బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఒక సినిమా కథ దర్శకుడు చెప్పగానే ఆ కథ నచ్చితే బాలయ్య ఒకే చెప్పగానే.. దర్శకుడు ఏది చెబితే అది చేస్తాడట బాలయ్య. మిగతా హీరోలు కథలో వేలు పెట్టి మార్పులు చేర్పులు చేసే ప్రయత్నాలు చేస్తారట. 

Advertisement

అఖండ చిత్రానికి ముందు వరకు బాలకృష్ణ పారితోషికం కేవలం రూ.4 కోట్లు మాత్రమే అంటే ఎవ్వరైనా నమ్మగలరా..? అంత పెద్ద స్టార్ హీరోకి అంత తక్కువ పారితోషికం ఏంటి అని ఎవ్వరైనా ఠక్కున అంటుంటారు.ఇది వాస్తవం. దర్శక, నిర్మాతలకు ఎప్పుడూ హీరోలు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ తరుచూ చెబుతుండేవారట. బాలకృష్ణ కూడా ఇప్పటివరకు అదే పాటిస్తూ వచ్చారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలకు పారితోషికాలు పెంచినప్పటికి అది తన స్వప్రయోజనాల కోసం కాకుండా.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సదుపాయాల కోసం ఉపయోగిస్తారట. బాలయ్య గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ విషయాలను పక్కకు పెట్టేసి.. బాలయ్య నటించిన గత 10 సినిమాలు వాటి కలెక్షన్ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

లెజెండ్ :

Manam News

బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్. మొదటి సినిమా సింహ కంటే కూడా లెజెండ్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. రూపాయలు 32 కోట్ల బ్రేకీవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన లెజెండ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూపాయలు 40.39 కోట్ల షేరు కలెక్ట్ చేసింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా ఈ చిత్రం నిలిచింది.

లయన్ :

Manam News

లెజెండ్ తర్వాత బాలయ్య నటించిన మరో చిత్రం లయన్. సత్యదేవ్ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం రూ. 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 20.6 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది.

డిక్టేటర్ : 

Manam News

దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో డిక్టేటర్ మూవీలో నటించారు బాలయ్య.  రూ. 27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.20.6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసి ఈ చిత్రం కూడా ప్లాప్ గానే మిగిలింది.

Also Read :   బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

గౌతమీపుత్ర శాతకర్ణి : 

బాలకృష్ణ 100 వ చిత్రంగా నటించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని  దర్శకుడు క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమా రూ. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. బాక్సాఫీస్ వద్ద రూ. 50.89 కోట్ల చేరును కలెక్ట్ చేసి సినీ ఇండస్ట్రీలో ఇటుగా నిలిచింది. అప్పటివరకు బాలకృష్ణ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూలు చేసిన చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచింది.

Advertisement

పైసా వసూల్ :

Manam News

మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ పైసా వసూల్. ఈ సినిమా రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బార్ లోకి దిగింది. రూ. 18.72 కోట్ల షేర్   మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

జై సింహా : 

Manam News

 

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైసింహ. ఈ సినిమా రూ. 27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.  కేవలం రూ. 29 కోట్ల షేర్ ని వసూలు చేసి హిట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ కథానాయకుడు : 

Manam News

ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగంగా రూపొందించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. సినిమా రూ.70 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది. బాక్సాఫీస్ వద్ద రూ. 20.61 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినది. బాలకృష్ణ సినీ కెరీర్ లోనే అత్యధిక థియేటర్ బిజినెస్ జరిగింది కూడా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికే కావడం విశేషం. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఎన్టీఆర్ మహానాయకుడు : 

Manam News

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగంగా రూపొందించినటువంటి చిత్రం “ఎన్టీఆర్ మహానాయకుడు”. ఈ సినిమా రూ. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే కేవలం బాక్సాఫీస్ వద్ద రూ.3.9 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. బాలయ్య సినీ కెరీర్ లోనే  ఈ చిత్రం మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

Also Read :  బాలీవుడ్ హీరోల్లో రిచ్చెస్ట్ హీరో షారుఖ్ ఖాన్.. ఎన్ని కోట్లంటే..?

రూలర్ : 

Manam News

కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన రెండో చిత్రం రూలర్. రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం బరిలోకి దిగింది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 10.05 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

Also Read :  “వీరసింహారెడ్డి”కి బాలయ్య “అఖండ” కంటే 8 కోట్లు ఎక్కువ తీసుకున్నారా..?

అఖండ :

బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన మూడవ చిత్రం అఖండ. ఈ చిత్రం రూ.54 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది. బాక్సాఫీస్ వద్ద రూ.73.29 కోట్ల షేర్  వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

Also Read :   పరుగు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది.. పెళ్లి తరువాత ఏం చేస్తుందో తెలుసా ? 

వీర సింహారెడ్డి :

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమా రూ. 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 8 రోజులకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 69 కోట్ల షేర్ ని వసూలు చేసింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా “అఖండ” రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది. బాలయ్య సినీ కెరీర్ లోనే వీరసింహారెడ్డి పెద్ద బిగ్ బ్లాస్టర్ గా నిలిచే అవకాశం అనిపిస్తోంది.

Also Read :  ‘శంకర్ దాదా MBBS’ టు ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ ఇవే!

Visitors Are Also Reading