Home » పరుగు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది.. పెళ్లి తరువాత ఏం చేస్తుందో తెలుసా ? 

పరుగు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది.. పెళ్లి తరువాత ఏం చేస్తుందో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో కనిపించిన హీరోయిన్ షీలా కౌర్ మీకు గుర్తుందా..? అమాయకమైన చూపు.. ఇంకా పసితనం పోని రూపు, బెదురు బెదురుగా చూసే కళ్లు.. రెండు జడలతో సింపుల్ లంగా ఓణిలో పదారాణాల తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించి కుర్రకారుకి గిలిగింతలు పెట్టించింది. పరుగు సినిమా విడుదలైన తరువాత ఎంతో మందికి కలల రాణి అయింది షీలా. బ్యాచిలర్స్ రూమ్ లో ఆమె వాల్ పోస్టర్లు అప్పట్లో నిండిపోయేటివి. 

Advertisement

 

ఇక ఆ తరువాత  ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్  సినిమాలో ఆమెను చూసిన వారందరూ ఏంటి ఈమె షీలానేనా అనేంతగా ఆశ్చర్యపోయారు. అల్ట్రామోడ్రన్ లుక్ లో అదరగొట్టేసింది. ముఖ్యంగా టాలీవుడ్ లో షీలా నటించింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. తన కెరీర్ మొత్తం 20 సినిమాల్లో నటించిన షీలా.. నవదీప్ సీతాకొక చిలుక సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ సరసన నటించిన పరుగు చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో అమాయకమైన రూపు, తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది షీలా. ఇక ఆ తరువాత రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్ వంటి తదితర సినిమాలతో పాటు పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. షీలా చివరిసారిగా 2011లో నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. 

Advertisement

Also Read :  ‘శంకర్ దాదా MBBS’ టు ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి గత 10 సినిమాల కలెక్షన్స్ ఇవే!

ఆ తరువాత వెండితెర మీద అస్సలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో షీలా క్యాన్సర్ బారిన పడ్డారని అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారని అప్పట్లో అనేక పుకార్లు వినిపించాయి. ప్రస్తుతం షీలా ఎక్కడ ఉంది.. ఏం చేస్తుందంటే ప్రస్తుతం షీలా మ్యారేజ్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తుంది. మూడేళ్ల కిందట ఆమెకు ఓ వ్యాపారవేత్తతో పెళ్లి అయింది. అకస్మాత్తుగా పెళ్లి వార్త చెప్పి అందరినీ ఆశ్చర్యపరించింది షీలా. 2020లో కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో ఆమె పెళ్లి జరిగింది. తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే చాలా సింపుల్ గా వీరి పెళ్లి జరిగింది. మరోవైపు ఆ సమయంలో కరోనా కూడా తోడవ్వడంతో పెద్దగా ఎవ్వరినీ ఆహ్వానించలేదని సమాచారం. ప్రస్తుతం షీలా భర్త సంతోష్ రెడ్డితో కలిసి సూపర్ మార్కెట్ ని నడుపుతున్నట్టు తెలుస్తోంది.  

Also Read :  శుభ్ మన్ గిల్ కు కొత్త పేరు పెట్టిన సునీల్ గావస్కర్.. ప్రియురాలు కూడా ఇలానే పిలవాలేమో?

Visitors Are Also Reading