Telugu News » Blog » బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

by Bunty
Ads

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సంచలనాలు సృష్టించింది. రిలీజ్ రోజున డివైడ్ టాక్ వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్ క్రియేట్ చేసింది. తొలి రోజే రూ.25 కోట్ల వరకు షేర్ ను సాధించి బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

Advertisement

అఖండ రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు నెల కోల్పోతున్నాడు. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టనుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు రావడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకకు యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ లుగా వచ్చారు. ఇక ఈ వేడుకలో బాలకృష్ణ స్టేజ్ పై పాట పాడి అందరిలో హుషారు నింపాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలా సింహంల ఉండాలన్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు ఈ వాక్యాలే వివాహస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

READ ALSO : వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ?

Advertisement