Home » ఉద‌య్ కిర‌ణ్ కు పోటీగా బ‌న్నీతో సినిమా చేయాల‌నుకున్న తేజ‌..చివ‌రికి ఏమైందంటే..!

ఉద‌య్ కిర‌ణ్ కు పోటీగా బ‌న్నీతో సినిమా చేయాల‌నుకున్న తేజ‌..చివ‌రికి ఏమైందంటే..!

by AJAY
Ad

ఉద‌య్ కిర‌ణ్…టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వరుస హిట్ల‌తో ఉదయ్ కిర‌ణ్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అందం న‌ట‌న‌తో ల‌వ‌ర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఉద‌య్ కిర‌ణ్ ఆ రేంజ్ కు ఎద‌గ‌డానికి ఆయ‌న టాలెంట్ తో పాటూ ద‌ర్శ‌కుడు తేజ కృషి కూడా ఉంది. చిత్రం సినిమాతో ఉద‌య్ కిర‌ణ్ ను తేజ హీరోగా ప‌రిచ‌యం చేశాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత ఉయయ్ కిరణ్ కు ఆశించిన మేర అవ‌కాశాలు రాలేదు.

Advertisement

 

ఇక అలాంటి స‌మయంలో నువ్వు నేనుతో ఉద‌య్ కిర‌ణ్ కు తేజ మ‌రో అవ‌కాశం కూడా ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో పాటూ ఉద‌య్ కిర‌ణ్ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అయితే వీరిద్ద‌రికీ నువ్వు నేను షూటింగ్ స‌మ‌యంలో మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కూ తేజతో చేసిన ఉద‌య్ కిర‌ణ్ ఆ త‌ర‌వాత వీఎన్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో శ్రీరామ్ సినిమా చేశాడు.

Advertisement

మ‌రోవైపు తెజ ఉద‌య్ కిర‌ణ్ లేకుండా నితిన్ హీరోగా జ‌యం సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ తో పోటీగా విడుద‌ల‌య్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న వివాదం కార‌ణంగానే పోటాపోటీగా సినిమాలు విడుద‌ల చేశార‌ని అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీరామ్ త‌మిళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కింది. ఇక జ‌యం విష‌యానికి వ‌స్తే ఇదో ప‌ల్లేటూరి ప్రేమ క‌థ‌..ఈ రెండు సినిమాల‌కు కూడా ఆర్పీ ప‌ట్నాయ‌క్ మ్యూజిక్ అందించాడు.

Also Read: ఉద‌య్ కిర‌ణ్ భార్య విషిత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే..!

మ‌రోతెర‌వెన‌క విష‌యం ఏంటంటే శ్రీరామ్ సినిమాలో ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం పాత్ర‌కు తేజ అనే పేరు పెట్ట‌డం..ఈ పాత్ర‌ను త‌ర‌చూ తిడుతూ ఉంటారు. తేజ‌పై కోపంతో కావాల‌నే ద‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం పాత్ర‌కు ఆ పేరు పెట్టార‌ని వార్త‌లు వినిపించాయి. దాంతో తేజ కూడా త‌న సినిమాను శ్రీరామ్ కు పోటీగా విడుద‌ల చేశాడు. జ‌యం ఫ‌స్ట్ డే నుండే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ అందుకుంది. ఇక ఈ సినిమాలో తేజ అల్లుఅర్జున్ ను హీరోగా తీసుకోవాల‌నున్నాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల బ‌న్నీ ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు. త‌రవాత నితిన్ ను సెల‌క్ట్ చేశారు.

Also Read: స్వాతిముత్యం బుడ్డోడిని గుర్తుప‌ట్టారా…ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో…!

Visitors Are Also Reading