Home » “వీరసింహారెడ్డి”కి బాలయ్య “అఖండ” కంటే 8 కోట్లు ఎక్కువ తీసుకున్నారా..?

“వీరసింహారెడ్డి”కి బాలయ్య “అఖండ” కంటే 8 కోట్లు ఎక్కువ తీసుకున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తండ్రి నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. బాలకృష్ణ అంటే ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అలాంటి బాలయ్య వీర సింహారెడ్డి మూవీ గురించి ఇప్పుడు చూద్దాం..గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వచ్చిన మూవీ వీర సింహారెడ్డి. సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయింది.

Advertisement

ఈ సంక్రాంతికి బాలయ్య అభిమానులకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆరు పదుల వయసు దాటిన యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు బాలకృష్ణ. వీర సింహారెడ్డి హిట్ తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో శృతిహాసన్, హనీ రోజ్ కథానాయకగా నటించగా, బాలయ్య దిపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ విలన్ పాత్రల్లో అదరగొట్టారు. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాంటి బాలయ్య ఈ చిత్రం కోసం భారీగానే పారితోషకం తీసుకున్నారట. ఇంతకీ ఎంత తీసుకున్నారయ్యా అంటే 20 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారని సమాచారం. అఖండ మూవీకి పన్నెండు కోట్లు తీసుకున్న బాలయ్య, ఈ వీర సింహారెడ్డికి ఏకంగా 20 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

also read:పరుగు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది.. పెళ్లి తరువాత ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading