Home » బాలీవుడ్ హీరోల్లో రిచ్చెస్ట్ హీరో షారుఖ్ ఖాన్.. ఎన్ని కోట్లంటే..?

బాలీవుడ్ హీరోల్లో రిచ్చెస్ట్ హీరో షారుఖ్ ఖాన్.. ఎన్ని కోట్లంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ హోదా వచ్చింది అంటే అది కేవలం సినిమాలతోనే కాదు, ఇతర ప్రోగ్రాంల ద్వారా కూడా చాలా సంపాదిస్తూ ఉంటారు. కోట్లాది రూపాయలు వస్తూ ఉంటాయి. ఇందులో కొంతమంది హీరోలు, హీరోయిన్లు బిజినెస్ లు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతాడు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్.. మరి ఆయన ఆస్తిపాస్తులు ఎంతో తెలుసుకుందాం.. పేరుకు బాలీవుడ్ హీరో అయిన హాలీవుడ్ హీరోలతోనే పోటీ పడుతూ ఉంటారు. ఇక బాలీవుడ్ టాలీవుడ్ హీరోల్లో అయితే ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ ఉండరట.

Advertisement

Also Read;శ్రీదేవి NTR ను ఏమని పిలిచేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ప్రపంచంలోనే షారుఖ్ ఖాన్ సంపన్న హీరోల లిస్టులో టాప్ 10 లో ఉంటారని అంటున్నారు. దాదాపుగా ఆయన సంపాదన మొత్తం 770 మిలియన్ల యుఎస్ డాలర్లట. ఇది భారతీయ లెక్కల ప్రకారం దాదాపు 6150 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. సాధారణంగా షారుఖ్ ఖాన్ ఏడాదికి 300 కోట్లకు పైగానే సంపాదన ఉంటుందట. ఓవైపు సినిమాలు మరోవైపు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటున్న విషయం అందరికీ తెలుసు. ఒక్కో సినిమాకు షారుక్ ఖాన్ 100 నుంచి 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంచనా..

Advertisement

అయితే షారుక్ ఖాన్ కు దుబాయిలో కూడా విలాసవంతమైన బంగ్లాలు పలు ఆస్తులు ఉన్నాయట. ప్రపంచ సంపన్న నటుల్లో మొదటి స్థానంలో హాలీవుడ్ యాక్టర్ జర్రి సీన్ ఫీల్డ్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా పదివేల కోట్లకు పైగానే. ఆ తర్వాత టైలర్ ఫెర్రీ ఈయన ఆస్తి విలువ ఒక బిలియన్ డాలర్స్. ఇక డాని జాన్సన్ దాదాపు 7వేల కోట్లు. ఆ తర్వాతి నాలుగో స్థానంలో ఉన్నది షారుక్ ఖాన్ . ప్రపంచంలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న టామ్ క్రూజ్ కంటే షారుక్ ఖాన్ ఆస్తులు ఎక్కువగా ఉండడం ఆసక్తికర అంశం. ఇక తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read:UPASANA:ఉపాసన ఇంట్లో తీవ్ర విషాదం..పెద్దదిక్కు కోల్పోయిందా..?

Visitors Are Also Reading