Telugu News » Blog » Christmas wishes, quotes, images in Telugu 2022 : క్రిస్మస్ పండుగ ప్రత్యేకత.. 2022 క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు మీ కోసం

Christmas wishes, quotes, images in Telugu 2022 : క్రిస్మస్ పండుగ ప్రత్యేకత.. 2022 క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు మీ కోసం

by Anji
Ads

Christmas wishes, quotes, images in Telugu 2022: సాధారణంగా క్రైస్తవులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైనది క్రిస్మస్. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా వేడుకలను జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చీలలో ప్రత్యేకంగా Christams Wishes Telugu ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు.. కేకులు కోసి తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతుంటారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 25న  క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు..? దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Christmas wishes, quotes, images in Telugu 2022

రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు అనే పట్టణంలో మేరీ అనే ఓ యువతికి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనిపించి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మినిస్తావని చెప్పిందట. పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతను దేవుని యొక్క కుమారుడు అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు రాత్రి కలలో జోసెఫ్ కి  దేవదూత కనిపించి “మేరీని నీవు విడిపెట్టకూడదు. ఆమె భగవంతుడి వరం వల్ల గర్భవతి అయింది. ఆమెకు పుట్టు కొడుకు దేవడి కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ వారి పాపా నుంచి రక్షిస్తాడు” అని చెప్పాడు.  

క్రిస్టమస్ విషెస్, గ్రీటింగ్స్, కొటేషన్లు 2022

Advertisement

Christamas Wishes Telugu

ఇక ఆ తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం అయినటువంటి బెత్లేహేమ్ కి వెళ్లారు. తీరా అక్కడికి చేరుకునే సరికి ఉండడానికి వసతి లేదు. చివరకి ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయమిచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. 2022 సంవత్సరాల కిందట డిసెంబర్ 24 అర్థరాత్రి 12 గంటల తరువాత అనగా డిసెంబర్ 25న ఏసు జన్మించాడు. ఆ రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ డిసెంబర్ నెల ప్రారంభం నుంచే మొదలవుతుంది. క్రైస్తవ సోదరులు తమ ఇళ్లను, చర్చీలను చాలా అందంగా అలంకరించుకుంటారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అదేవిధంగా ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకుంటారు. రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిన్న గాజు గోళాలతో అలంకరిస్తుంటారు. ఇది అంతా ఈ క్రిస్మస్ పండుగ ప్రత్యేకత అనే చెప్పవచ్చు. 

Manam News

క్రిస్మస్ పండుగకు చాలా మంది తమ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు చెబుకుంటారు. రకరకాలుగా క్రిస్మస్ పండుగ విషెష్ చెప్పుకుంటారు. మనం న్యూస్ తరుపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ శుభాలు కలుగాలని ఆకాంక్షిస్తున్నాం. మీ ఆత్మీయులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇందుకోసం మా వంతుగా మీకోసం సరికొత్త గ్రీటింగ్స్, వాట్సాప్ విషెష్, క్రిస్మస్ కొటేషన్లను తీసుకొచ్చాం. ఈ గ్రీటింగ్స్ ని మీ ఆత్మీయులతో పంచుకొని క్రిస్మస్ పండుగను ఎంజాయ్ చేయండి. 

Happy Christmas Wishes, Quotes, Messages in Telugu 2022, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగు లో 

  • క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ….మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
  • కరుణామయుడు జన్మించిన ఈరోజు.. మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు రావాలి.. ఆ ప్రభువు వల్ల మీకు దీర్ఘాయువు కలగాలి.. – క్రిస్మస్ శుభాకాంక్షలు
  • క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ “శాంతి సౌక్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

Advertisement

Also Read: Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023