Home » Maraige day wishes in Telugu : స్నేహితులకు, బంధువులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Maraige day wishes in Telugu : స్నేహితులకు, బంధువులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

by Anji
Ad

సాధారణంగా మన జీవితాల్లో ఏర్పడే అన్ని బంధాలకెల్లా అతి ముఖ్యమైన బంధం వివాహ బంధం. ఇద్దరూ వ్యక్తులు వివాహ బంధంతో ఏకమై తద్వారా వారు ఒక కుటుంబాన్ని సమాజానికి అందివ్వడం అనేది చాలా గొప్ప అంశం. అందుకే పెళ్లి బంధంపై మనకున్న నమ్మకం రోజు రోజుకు క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. మనదేశంలో ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థను బలంగా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా వారు విశ్వసించడమే కాకుండా దానిని పాటిస్తున్నారు. 

Advertisement

ఈ నేపథ్యంలో మన కుటుంబంలో వివాహ బంధం ద్వారా ఒకటైన వారికి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడ కొన్ని సందేశాలు ఇస్తున్నాం. ప్రస్తుత తరుణంలో ప్రతీ చిన్న అకేషన్ ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా గడిపేందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం మనకు తెలిసిన వారు, స్నేహితులు లేదా బంధువుల పెళ్లి రోజు వచ్చినప్పుడు వారికి మీరు పంపించాల్సిన సందేశాలు, శుభాకాంక్షలు కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  • అవధులు లేని ప్రేమానురాగాలతో మీ యొక్క వైవాహిక జీవితం సుఖవంతంగా సాగిపోవాలని కోరుకుంటూ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. 
  • మా జంటకి ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తూ.. జీవితంలో సమస్యలను ఒక్కొక్కటిగా ఎలా ఎదుర్కోవాలనేది మీ ఇద్దరి నుంచే నేర్చుకోగలిగాం. మీ లాంటి స్ఫూర్తివంతమైన జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. 
  • మన కుటుంబంలో ఉన్నటువంటి అన్ని జంటలలో మీదే ఆదర్శమైన జంట అని.. పేరు తెచ్చుకున్న గొప్ప జంట. అలాంటి జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 
  •  మీ జంట మధ్య ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే మీ ఇరువురికి మంచి జీవితాన్ని ఇవ్వాలని నీ స్నేహితుడిగా మనస్పూర్తిగా కోరుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు. 
  • నేను చూసినటువంటి భార్య, భర్తల్లో మీ జంటనే ఎలాంటి కల్మషం లేకుండా ఉంది. అలాంటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. 

  • స్నేహితులుగా ప్రారంభమైన మీరు ఆ తరువాత జంటగా మారారు. స్నేహం, ప్రేమ కలిసి మీ బందం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ.. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. 
  • మీ వైవాహిక జీవితం ఇప్పటి మాదిరిగానే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ భార్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 
  • మీ పెళ్లి జీవితం ముగింపు లేకుండా సాగిపోవాలని నీ స్నేహితుడిగా నేను కోరుకుంటూ.. మీ ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. 
  • నీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అయినటువంటి పెళ్లి రోజు సందర్భంగా మీ జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 
  • నా ప్రాణ స్నేహితునికి అతని పెళ్లి రోజు సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  • నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు ఒక ఇంటి వాడు అవుతున్న సందర్భంగా వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పెళ్లిరోజు శుభాకాంక్షలు. 

 

Visitors Are Also Reading