Home » Birthday Wishes, Kavithalu, Quotes in Telugu పుట్టిన రోజు శుభాాకాంక్షలను ఇలా చెప్పండి..!

Birthday Wishes, Kavithalu, Quotes in Telugu పుట్టిన రోజు శుభాాకాంక్షలను ఇలా చెప్పండి..!

by Anji
Ad

Birthday Wishes, Kavithalu, Quotes in Telugu: సాధారణంగా మన ఫ్యామిలీలో లేదా బంధువులదో, స్నేహితులదో ఇలా ఎవరిదైనా పుట్టిన రోజు ఉన్నదంటే వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటాం. కొంత మంది వాట్సాప్ లో స్టేటస్ పెడుతుంటారు. మరికొందరూ కవితల ద్వారా వారికి ప్రేమ పూర్వకంగా, భిన్నంగా రకరకాలుగా శుభాకాంక్షలు చెబుతుంటారు. పుట్టిన రోజు శుభాకాంక్షలను ఎవరికీ నచ్చినట్టు వారు చెబుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత పేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ ఇలా రకరకాలుగా విషెస్ చెబుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కొన్ని Birthday Wishes in Telugu బర్త్ డే విషేష్ గురించి తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

Happy Birthday Wishes in Telugu

  • ఒక వ్యక్తికి జీవితంలో గొప్ప రోజులు రెండే.. ఒకటి మనం పుట్టిన రోజు.. మరొకటి పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  • నవ్వు నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ నూరేళ్లు హాయిగా వర్దిల్లాలి జన్మదిన శుభాకాంక్షలు 
  • బహుమతి కంటే అది ఇచ్చిన వారిని ఎక్కువగా ప్రేమించు.. అప్పుడు ప్రతి బంధం ఎంతో బలంగా కనిపిస్తుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు. మనం బాగా జీవించడం మన చేతుల్లోనే ఉంది పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  • నీకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని.. అందమైన వాక్యాలను వెతుకుతూ.. ఏవీ దొరకక చివరికీ ఇలా ప్రేమతో చెబుతున్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • మీకు ఎంతో ప్రియమైన వారితో ఈరోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ  జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
పుట్టిన రోజు శుభాాకాంక్షలను

పుట్టిన రోజు శుభాాకాంక్షలను

  • కోటి కాంతుల చిరునవ్వులతో.. భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  • మీ భవిష్యత్ మరింత శోభయమానంగా, ఉన్నతంగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు ఎన్నో నా చిన్ని జీవితంలో ఎన్ని పరిచయాలున్నా.. కలకాలం ఉండే తియ్యని స్నేహం నీది.. అలాంటి  నా ప్రియ నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • ఎదుటి వారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్పబహుమతి ఏముంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
Visitors Are Also Reading