Home » బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

బాలకృష్ణ సినిమా కోసం తన ఇంటిని ఇచ్చిన చిరంజీవి.. ఏ సినిమా కోసం అంటే ?

by Anji
Ad

సాధారణంగా సినిమా హీరోల అభిమానుల మధ్య పోటీ ఉన్నప్పటికీ హీరోల మధ్య ఎలాంటి పోటీ ఉండదు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల వరకు ఈ పోటీ ఉన్న వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా స్నేహంగా ఉంటారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఇద్దరూ హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ.. నువ్వా నేనా అనేవిధంగా పోటీపడుతూ ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకువస్తుంటారు. 

Also Read :   ఒక‌ప్పుడు కోట్లు సంపాదించిన ష‌కీలా…ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిలో ఉందో తెలుసా..?

Advertisement

సినిమాల పరంగా పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఈ హీరోల మధ్య చాలా మంచి స్నేహబంధం ఉందనే చెప్పాలి. ఇప్పటికీ ఇద్దరూ హీరోలు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతంలో బాలయ్య నటించిన ఓ సినిమా కోసం చిరంజీవి ఏకంగా తన ఇంటిని ఇచ్చేశారట. 1990లో ఏప్రిల్ 25న బాలకృష్ణ నటించిన నారీ నారీ నడుమ మురారీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ విడుదలై 33 ఏళ్లు అయింది. బాలకృష్ణకి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. బాలయ్య కెరీర్ లో 50వ సినిమా కావడం.. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం విశేషం.

Advertisement

Also Read :  అఖిల్ మూవీలో చెర్రీ.. టీజర్ చూపించింది అదేనా ?

Manam News

ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో ఉన్న తన గెస్ట్ హౌస్ ఇచ్చారట. దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరిగిందని తెలుస్తోంది.  చెన్నైలోని వెల్లిచ్చేరి ప్రాంతంలో ఉన్న ఈ గెస్ట్ హౌస్ పేరు హనీ హౌస్. ఇది చిరంజీవికి చాలా ఇష్టమైన ఇల్లు అంట. బాలయ్య మూవీ కోసం ఈ ఇంటిని అడగడంతో చిరంజీవి వెంటనే ఈ సినిమా షూటింగ్ కోసం ఇచ్చారట. ఇక బాలయ్య సినిమా కోసం తన ఇంటిని చిరంజీవి ఇచ్చారంటే వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. 

Also Read :  విజ‌య నిర్మ‌ల కాకుండా ఆ స్టార్ హీరోయిన్ పై కూడా కృష్ణ మ‌న‌సుపారేసుకున్నారా..? ఆమె ఎవ‌రంటే..?

Visitors Are Also Reading