Home » విజ‌య నిర్మ‌ల కాకుండా ఆ స్టార్ హీరోయిన్ పై కూడా కృష్ణ మ‌న‌సుపారేసుకున్నారా..? ఆమె ఎవ‌రంటే..?

విజ‌య నిర్మ‌ల కాకుండా ఆ స్టార్ హీరోయిన్ పై కూడా కృష్ణ మ‌న‌సుపారేసుకున్నారా..? ఆమె ఎవ‌రంటే..?

by AJAY

సూప‌ర్ స్టార్ కృష్ణ ప్ర‌స్తుతం మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా ఆయ‌న చేసిన సినిమాల ద్వారా మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల మదిలో చెర‌గ‌ని ముద్ర‌ను వేసుకున్నారు. త‌న సినీప్ర‌స్థానంలో కృష్ణ వంద‌ల సినిమాల‌లో న‌టించారు. టాలీవుడ్ కు కౌ బాయ్ లాంటి పాత్ర‌ను ఆమ‌నే ప‌రిచ‌యం చేశారు. కేవ‌లం ఒకేర‌క‌మైన పాత్ర‌ల‌లో కాకుండా విభిన్న పాత్ర‌ల‌లో న‌టించి కృష్ణ అభిమానులను సంపాదించుకున్నారు.

 

ఇక కృష్ణకు అప్ప‌ట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు మ‌హేశ్ బాబు కు ఏ రేంజ్ లో లేడీ ఫ్యాన్స్ ఉండేవారో అప్పుడు కృష్ణ‌కు కూడా అదే రేంజ్ లో ఉండేవారు. అంతే కాకుండా హీరోయిన్లు సైతం సూప‌ర్ స్టార్ వెంట‌ప‌డేవారు. కానీ ఆయ‌న మాత్రం హీరోయిన్ ల‌కు గాసిప్స్ కు వీళైనంత దూరంగా ఉండేవారు. ఇదిలా ఉంటే ఆయ‌న ఎక్కువగా హీరోయిన్ విజ‌య నిర్మ‌ల‌తో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

అంతే కాకుండా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డంతో చివ‌రికి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్న త‌ర‌వాత కృష్ణ త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కూ ఆమె చేయి విడిచిపెట్ట‌లేదు. అంతే కాకుండా త‌న కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఉండ‌లేదు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మ‌రోవైపు విజ‌య నిర్మ‌ల‌తో క‌లిసి ఉన్నారు.

ఇదిలా ఉంటే కృష్ణ ఇండ‌స్ట్రీలో మ‌రో ఇద్దరు హీరోయిన్ ల‌ పైన కూడా మ‌న‌సు పారేసుకున్నార్నవిష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆ హీరోయిన్ ల‌తో సినిమా చేయ‌డం అంటేనే కృష్ణ చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యేవార‌ట‌. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఇమంది రామారావు వెల్ల‌డించారు. ఆ హీరోయిన్ ల‌లో శ్రీదేవి ఒక‌రు అయితే మ‌రొక‌రు జ‌యప్ర‌ధ‌. వీరిద్ద‌రితోనూ కృష్ణ చాలా ఇష్టంగా సినిమాల‌లో న‌టించేవార‌ని జ‌ర్న‌లిస్ట్ తెలిపారు.

ALSO READ : Samantha : సమంత టెన్త్ క్లాస్ మెమో వైరల్… ఎన్ని మార్కులు వచ్చాయి అంటే!

Visitors Are Also Reading