Home » అఖిల్ మూవీలో చెర్రీ.. టీజర్ చూపించింది అదేనా ?

అఖిల్ మూవీలో చెర్రీ.. టీజర్ చూపించింది అదేనా ?

by Anji

టాలీవుడ్ అగ్ర  దర్శకుల్లో ఒకరైన  సురేందర్ రెడ్డి ఒకరు. సురేందర్ రెడ్డి తీసే సినిమా దాదాపు యావరేజ్ గా నైనా ఉంటుంది. ఎక్కువ శాతం సక్సెస్ సాధించే విధంగా ఉంటాయి ఈ దర్శకుడి సినిమాలు. తాజాగా ఈయన దర్శకత్వంలో  అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Also Read :   ప్రమాదంలో కోహ్లీ కెరీర్… ధోని, పాండ్యాది కూడా!

ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన విషయం తెలిసిందే. అంతేకాదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అది మరేంటో కాదు.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్ లో నటించారు. ఈ మేరకు తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read :  Dasara OTT: ఓటీటీలోకి వచ్చిన దసరా మూవీ..ఎందులో స్ట్రీమింగ్‌ అంటే

టీజర్ లో ఏజెంట్ ని ధృవ మీట్ అవ్వబోతున్నట్టు చూపించారు. టీజర్ లో పవర్ ఫుల్ గా దృవ బీజీఎం వస్తుంది. వెనుక వైపు నుంచి చరణ్ ని చూపించారు. ఏజెంట్ ఎక్కడ ఉన్నావు అంటూ చెర్రీ పవర్ పుల్ వాయిస్ వినిపిస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన టీజర్ వీడియోని అఖిల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.  ఈ టీజర్ కి ధృవ X ఏజెంట్ పరిస్థితులు మరింత వైల్డ్ గా మారుతున్నాయి అనే క్యాప్షన్ ని కూడా రాసుకొచ్చారు అఖిల్.రామ్ చరణ్ నటించిన ధృవ  సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.  

Also Read :  నరసింహనాయుడు లో మానస్ ఉన్నాడని మీకు తెలుసా… ఈ బుడ్డోడేనట…!

Visitors Are Also Reading