Home » మీ పాన్ కార్డు చెల్లుబాటు అవుతుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

మీ పాన్ కార్డు చెల్లుబాటు అవుతుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

by Anji
Ad

ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు ఇప్పుడు చాలా ముఖ్యం. కొందరూ కేటుగాళ్లు ఇతరుల పేర్లతో డూప్లికేట్ పాన్ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకి చేరాల్సినటువంటి పన్నులను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు. దీనిని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం తరచూ పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తోంది. ఆదాయ పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేవిధంగా ఆర్థిక లావాదేవీలు సజావుగా నిర్వహించేందుకు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు పాన్ కార్డు వ్యాలిడిటి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పాన్ కార్డు యొక్క వ్యాలిడిటీని చెక్ చేయడం చాలా ఉత్తమం. ఒకే వ్యక్తి మల్టిపుల్ పాన్ కార్డు వినియోగిస్తున్నా.. లేదా డూప్లికేట్ పాన్ కార్డులను ఉపయోగించినా ఆటోమెటిక్ గా ప్రభుత్వం తరచుగా పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తుంది. మీ పాన్ కార్డు చెల్లుబాటు అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ నియమాలను అనుసరించాలి. తొలుత ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ని విజిట్ చేయాలి. హోమ్ పేజీలో లెప్ట్ సైడ్ ఉన్నటువంటి Verify Your PAN Details అనే లింక్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. పాన్ కార్డు ఉన్న నెంబర్, పేరును ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేజీలో డిస్ ప్లే అవుతున్న Captcha కోడ్ ని ఎంటర్ చేయండి. ఆ తరువాత సబ్ మిట్ బటన్ క్లిక్ చేయండి. 

Advertisement

Manam News

ఎస్ఎంఎస్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ ద్వారా NSDL  PAN ఫార్మాట్ లో 567678 లేదా 56161 నెంబర్ కి SMS సెండ్ చేయడం ద్వారా పాన్ కార్డు చెల్లుబాటును చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఫోన్ నెంబర్ ABCDE1234 F అయితే.. NSDL PAN ABCDE1234F ఎంటర్ చేసి SMS సెండ్ చేయాలి. దీంతో PAN కార్డు యాక్టివ్ గా ఉందా లేదా అనే విషయం SMS రూపంలో వస్తుంది.  ఇటీవలే పైనల్ అలర్ట్ జారీ చేసింది. పాన్ కార్డు హోల్డర్స్ తమ పాన్ ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని కోరింది. పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం.. 2023 మార్చి 31లోపు పాన్ ని ఆధార్ తో లింక్ చేయడంలో విఫలం చెందినట్టయితే.. పాన్ కార్డు డీ యాక్టీనేట్ అవుతుంది. పాన్ తో లింక్ ఉన్న ఆర్థిక లావాదేవీలను తిరిగి ప్రారంభించలేదు. CBDT ప్రకారం.. పాన్ ని ఆధార్ తో లింక్ చేయడానికి చివరితేదీ మార్చి 31న నిర్ణయించారు. ఇప్పటివరకు లింక్ చేయని వారు అధికారిక పోర్టల్ Incometax.gov.in ని విజిట్ చేసి లింక్ చేయవచ్చు.

Also Read :  రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోయిన్ కచ్చితంగా అందుకు ఒప్పుకోవాల్సిందే..!

Visitors Are Also Reading