Home » బింబిసార ఫ‌స్ట్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?

బింబిసార ఫ‌స్ట్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే..?

by Anji
Ad

టాలీవుడ్ లో ప్ర‌తి వారం సినిమాలు విడుద‌ల‌వ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. ఇక వారం రెండు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన బింబిసార‌, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సీతారామం ఈ రెండు సినిమాలు ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్నాయి. అయితే ముఖ్యంగా అంద‌రి దృష్టి క‌ళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంపైనే ఉంది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా మెచ్చుకుంటార‌ని క‌ళ్యాణ్ రామ్ పేర్కొంటున్నారు. ఆగ‌స్టు 05న విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపు అందుకుంటున్నాయి. బింబిసార చిత్ర క‌థ‌ను 2019లో ద‌ర్శ‌కుడు వశిష్ట చెప్పాడు.

Advertisement

అయితే నాకు బాగా తెలిసిన కుర్రాడు కావ‌డం.. అప్పుడ‌ప్పుడు క‌థ‌లు చెబుతుండేవాడు. మొద‌టిసారి ఈ క‌థ చెప్పిన‌ప్పుడు బేసిక్ లైన్ చెప్పాడు. బింబిసార‌లో క్రూర‌త్వంతో కూడిన పాత్ర లేదు. ఇక ఆ త‌రువాత వ‌శిష్ట పాత్ర‌ల‌ను, క‌థ‌ను బాగా డెవ‌ల‌ప్ చేశాడు. ఈ క‌థ న‌చ్చ‌డం వ‌ల్ల కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేశాన‌ని క‌ళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా క‌థ ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 స‌మ‌యంలో న‌డుస్తుండ‌డంతో చాలా భాగం గ్రాఫిక్స్ తో న‌డిచే సీన్లు ఉంటాయ‌ట‌. ఇక ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. గ‌తంలో బాల‌య్య న‌టించిన ఆదిత్య 369 ట్రావెల్ క‌థాంశంతో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయింది.

Advertisement

మ‌ళ్లీ ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తొన్న ఈ స‌మ‌యంలో ట్రావెల్ స్టోరీ ఎలా ఉంటుందో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా.. విడుద‌ల‌కు ఒక‌ రోజు ముందే ప్ర‌ముఖ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు ఫ‌స్ట్ రివ్యూ వ‌దిలాడు. క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా బింబిసార‌కు పాజిటివ్ టాక్ బాగానే వ‌చ్చింది. ప్ర‌ముఖ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ బింబిసార ఫ‌స్ట్ రివ్యూ నంద‌మూరి అభిమానులు కాల‌ర్ ఎత్తుకునేలా ఇచ్చాడు. ఇక క‌ళ్యాణ్ రామ్ ఫ‌ర్‌ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే మూవీని ఆకాశానికి ఎత్తాడు. ఈ చిత్రం విజువ‌ల ఫీస్ట్ గా ఉంద‌ని పేర్కొంటున్నాడు. మ‌రి ఎలా ఉంటుందో మ‌రి కొద్ది గంటల్లోనే తెలియ‌నుంది.

Also Read : 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ క్యాప్ లేకుండా బ‌య‌టికే రావ‌డం లేదు.. కార‌ణం అదేనా..?

ఆ సినిమాలో ఎన్టీఆర్ అలా చేయడం వల్లే ఆ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ కి దూరమైందా..?

Visitors Are Also Reading