Home » ఆ సినిమాలో ఎన్టీఆర్ అలా చేయడం వల్లే ఆ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ కి దూరమైందా..?

ఆ సినిమాలో ఎన్టీఆర్ అలా చేయడం వల్లే ఆ హీరోయిన్ డ్యూయెట్ సాంగ్స్ కి దూరమైందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు వాణిశ్రీ.. ఆమె సీనియర్ ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో జతకట్టి సూపర్ హిట్స్ కొట్టారు.. తన అందచందాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వాణిశ్రీ సీనియర్ ఎన్టీఆర్ వల్ల డ్యూయట్స్ కి దూరం అయిందట. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. అసలు విషయం ఏంటో ఒక సారి చూద్దాం.. సీనియర్ ఎన్టీఆర్ వాణిశ్రీ కలిసి చాలా సినిమాల్లో నటించారు.. ఇందులో బంపర్ హిట్ కొట్టిన మూవీ ఎదురులేని మనిషి.

Advertisement

ఈ సినిమాని అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేయగా .. వాణిశ్రీ తన నటనతో అదరగొట్టింది. కానీ మూవీలో ఒక పాటను షూటింగ్ చేస్తుండగా వాణిశ్రీ చాలా ఇబ్బంది పడిందని, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఆమెకు నచ్చలేదని, దీంతో ఈ విషయాన్ని ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్ళిందట. ఈ విషయంలో సాయం చేయాలని ఎన్టీఆర్ ని వాణిశ్రీ కోరింది. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఏమీ చెప్పలేనని, వాళ్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తారు కాబట్టి వారు చెప్పినట్లే చేయాలని అదే ట్రెండ్ నడుస్తోందని అన్నారట.

Advertisement

దీంతో వాణిశ్రీ ఏం చేయలేక ఇబ్బందితో ఆ చిత్రంలోని పాటలను పూర్తి చేసిందని తెలుస్తోంది . దీని తర్వాత తాను చేసే ఏ సినిమాలో అయినా డ్యూయట్ సాంగ్స్ చేయబోనని ముందే చెప్పిందట వాణి శ్రీ.ఆ విధంగా ముందు కండీషన్ పెట్టిన తర్వాతే సినిమా ఒప్పుకునేదని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ మాత్రం పరోక్షంగా కారణమయ్యారని తెలుస్తోంది.

ALSO READ;

Visitors Are Also Reading