Home » Big Boss Season 7: బిగ్ బాస్ 7 సీజన్ లో కార్తీకదీపం మోనిత సందడి.. రెమ్యునరేషన్ ఎంతంటే?

Big Boss Season 7: బిగ్ బాస్ 7 సీజన్ లో కార్తీకదీపం మోనిత సందడి.. రెమ్యునరేషన్ ఎంతంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ లిస్ట్ లో కార్తీక దీపం ఫేమ్ మోనిత కూడా ఉందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా పాపులర్ అయిన మోనిత బిగ్ బాస్ సీజన్ 7 లో అలరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

అయితే.. బిగ్ బాస్ సీజన్ 7 కోసం శోభా శెట్టి గట్టి గానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లేడీ విలన్ వారం రోజులకు గాను లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. అయితే.. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆమెకు డిమాండ్ ఉండడంతో.. ఆమె షో కి వస్తే సందడి ఉంటుంది అన్న ఉద్దేశ్యంలో ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ 7 సీజన్లో హైయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ లో శోభా శెట్టి కూడా ఒకరిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని..

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading