Home » గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

by Bunty
Ad

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ టోర్నమెంట్లో ఇప్పటికే ఒకసారి ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాద్ జట్టు… గత రెండు సంవత్సరాలుగా మాత్రం ఘోరంగా విఫలమౌతూ వస్తుంది. ఇక 2024 ఐపీఎల్ కోసం ఇప్పటినుంచే హైదరాబాద్ జట్టు కసరత్తులు మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా తాజాగా హైదరాబాద్ జట్టు కెప్టెన్, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడెన్ మార్క్రమ్ ఓ ఇంటివాడు అయ్యాడు.

Advertisement

తన స్నేహితురాలు అయిన నికోల్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ మార్క్రమ్. గత పది సంవత్సరాలుగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ గురించి గత సంవత్సరం… ఇరు కుటుంబాలకు చెప్పేశారు. దీంతో ఇరుకుటుంబ సభ్యులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… గత ఏడాదే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన ఒక ఏడాది తర్వాత అంటే తాజాగా… హైదరాబాద్ కెప్టెన్ మార్క్రమ్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

శనివారం రోజున అంటే నిన్న సెంచూరియన్ లోని ఓ రాజ్ మహల్ లో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి… అతని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2023 సీజన్ లో హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా మార్క్రమ్ నియామకమైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… ఐపీఎల్ 2024 కోసం ఇప్పటినుంచే జట్టును తయారు చేస్తోంది యాజమాని కావ్య మారన్. ఇందులో భాగంగానే హైదరాబాద్ జట్టు కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను నియామకం చేయాలని డిసైడ్ అయ్యారు.

 

ఇవి కూడా చదవండి

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading