Home » తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ఫలితం గురించి  తెలిస్తే ఇక వదలిపెట్టరు..!

తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఖాళీ కడుపుతో తీసుకుంటే కలిగే ఫలితం గురించి  తెలిస్తే ఇక వదలిపెట్టరు..!

by Anji
Ad

ప్రతీ వంటింట్లో ఉల్లిపాయలను వంటల్లో తప్పకుండా వాడుతుంటారు. ముఖ్యంగా మన పెద్దలు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటుంటారు. ఉల్లిపాయలలో చాలా రకాల ఔషద గుణాలున్నాయి. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను ఖాళీ కడుపుతో తీసుకుంటే.. శరీరంలో ఎన్నో ఆరోగ్య మార్పులు వస్తున్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

రక్తాన్ని శుభ్రం చేయడానికి ఉల్లిపాయలు సహాయపడుతాయి. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయలు ఇంకా మేలు చేస్తాయి. ప్రతీ రోజు ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన ఉల్లిపాయని తీసుకోవడం వల్ల రక్తంలో ట్యాగ్గిన్స్ తొలగిపోయి రక్త ప్రసరణ  సక్రమంగా జరుగుతుంది. జీర్ణ శక్తిని పెంచుతాయి. అజీర్తిని నయం చేస్తుంది. పొట్టని తగ్గిస్తుంది. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను నిత్యం ఉదయం వేళలో తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పొట్ట, తుంటి చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 

Also Read :   జీలకర్రలో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Advertisement

ఉల్లిపాయ,తేనె కలిపి తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా...ముఖ్యంగా ఈ సమయంలో...  - Chai Pakodi

తొలుత శుభ్రమైన పాత్ర లేదా గాజు సీసా తీసుకొని బాగా ఊరించిన ఉల్లిపాయలను వేసి రెండు ముక్కలుగా కట్ చేసి.. దానిని కప్పి ఉంచడానికి తేనె పోయాలి. రెండు రోజుల పాటు దీనిని పక్కకు పెట్టుకోవాలి. రెండు రోజుల తరువాత ఉల్లిపాయలు తేనే బాగా కలిసిపోతుంది. మీరు ఉంచిన దానికంటే కొంచెం సన్నగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిలోని నీరు తేనెతో పాటు పీల్చుకుంటుంది. దీనిని ఉదయాన్నే తింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చాతి జబ్బులు వదిలించుకోవడానికి ఔషదంగా పని చేస్తుంది. చాతి సమస్యతో బాధపడేవారు నిద్రపోయే ముందు తేనెలో నానబెట్టిన ఉల్లిపాయను తింటే రెండు రోజుల్లో చాతిలో ఉన్నటువంటి కఫం నోటి ద్వారా లేదా మలం ద్వారా బయటికి వెళ్లిపోతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాను మీరు కూడా ప్రయత్నించండి. 

Also Read :   హిమాలయాల్లో లభించే ఈ పూల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading