Home » హిమాలయాల్లో లభించే ఈ పూల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

హిమాలయాల్లో లభించే ఈ పూల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా హిమాలయ పర్వతాలను మూలికల నిధిగా పిలుస్తుంటారు. అక్కడ చాలా రకాల మొక్కలు, చెట్లుంటాయి. వాటిలో అన్నింటి గురించి మనకు తెలియకపోవచ్చు. హిమాలయ పర్వతాలలో ఉండే మూలికలను ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వాటితో తయారు చేసిన మందులు పలు వ్యాధులతో పోరాడుతాయి. అందులో ముఖ్యంగా బుర్షాన్ మొక్క ఒకటి. బుర్షాన్ పువ్వులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. లేత గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉంంటాయి. ఇవి ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా బురాన్ష్ పువ్వుల నుంచి రసం తీసి తాగుతారు. ఈ పువ్వుల రేకులలో క్వినిక్ యాసిడ్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బురాన్ష్ పూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

  • ప్రధానంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల మహిళలో రక్తహీనత కనిపిస్తుంది. దీంతో రక్తహీనత వంటి వ్యాధులు ప్రారంభమవుతాయి. బురాన్ష్ తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త కొరతను తీర్చవచ్చు. బురాన్ష్ పువ్వులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది. దీంతో రక్తహీనత వంటి వ్యాధులు దూరం అవుతాయి. 
  • వయస్సు పెరిగే కొద్ది ఎముకలు బలహీనమై కీళ్ల నొప్పుల సమస్య ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితిలో బురాన్ష్ చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం కీళ్ల నొప్పులను దూరం చేయడం ద్వారా ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  

Also Read :  ఇలా చేస్తే మీ చెడు కొలెస్ట్రాల్ శాశ్వతంగా దూరం..!

  • బురాన్ష్ యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలను కలిగిస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తోంది. డయాబెటిక్ పేషెంట్లు బురాన్ష్ పువ్వుల రసాన్ని తాగాలని నిపుణులు సూచిస్తారు. 
  • బురాన్ష్ ని ఆయుర్వేదంలో పోషకాల నిధిగా పరిగణిస్తారు. కాల్షియం, జింక్, రాగి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. బురాన్ష్ పువ్వుల జూస్ ని క్రమం తప్పకుండా తాగితే శరీరంలోని పోషకాహార లోపం తొలగిపోతుంది. శరీరాన్ని బలంగా మార్చడంలో సహాయపడుతుంది. 

Also Read :  నరేష్ తన మూడో భార్యకి భరణం కింద ఎన్ని కోట్లు ఇవ్వనున్నాడో తెలుసా ?

Visitors Are Also Reading