Home » ఖలేజాలో ముందు మహేష్ బాబును హీరో అనుకోలేదట..ఎవరిని అనుకున్నారంటే..?

ఖలేజాలో ముందు మహేష్ బాబును హీరో అనుకోలేదట..ఎవరిని అనుకున్నారంటే..?

Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే మనస్తత్వం మహేష్ బాబు సొంతమని చెప్పవచ్చు. ఎప్పుడు ఎలాంటి హంగు ఆర్బటాలు లేని సాదా సీదా హీరోగా మహేష్ బాబు కనిపిస్తారు. అలా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఇంత ఎదిగారు. అలాంటి మహేష్ బాబు ఖలేజా సినిమా అంటే తెలియని వారు ఉండరు. అయితే ఖలేజా చిత్రంలో మహేష్ బాబును ముందుగా హీరో అనుకోలేదట దర్శకుడు త్రివిక్రమ్.

also read:మహేష్ “మహర్షి” మూవీలో అల్లరి నరేష్ పాత్రకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

Advertisement

 

ఆ విశేషాలు ఏంటో చూద్దామా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లను త్రివిక్రమ్ ఒకరు. తన కెరియర్ ప్రారంభించడానికి ముందుగా ఎన్నో సినిమాలకు కథలు, మాటలు అందించారు. మాటల మాంత్రికుడిగా పేరు పొందారు. అలా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. నువ్వే నువ్వే సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత తన డైరెక్షన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు. ఇందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి కూడా.

Advertisement

also read:బలగం దర్శకుడితో బాలయ్య సినిమా..?

అయితే ఈయన డైరెక్షన్లో వచ్చిన ఫ్లాప్ అయిన మూవీ ఖలేజా. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో అయినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ బుల్లితెరపై దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అలాంటి ఖలేజా మూవీకి ముందుగా మహేష్ బాబు హీరో అనుకోలేదట. పవన్ కళ్యాణ్ ను తీసుకుందామని అనుకున్నారట త్రివిక్రమ్. ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పితే ఆయన బిజీగా ఉండటం వల్ల రిజెక్ట్ చేశారట. తర్వాత మహేష్ కు చెప్పడంతో ఆయనకు బాగా నచ్చడం వెంటనే సెట్స్ పైకి వెళ్లడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు త్రివిక్రమ్.

also read:

Visitors Are Also Reading