Home » మహేష్ “మహర్షి” మూవీలో అల్లరి నరేష్ పాత్రకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

మహేష్ “మహర్షి” మూవీలో అల్లరి నరేష్ పాత్రకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా మహేష్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో మహర్షి మూవీ ఒకటి. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్ ఈ మూవీలో మహేష్ కు స్నేహితుడి పాత్రలో నటించాడు.

Maharshi

Maharshi

ఈ మూవీ లో వీకెండ్ ఫామింగ్ అనే ఒక కొత్త పాయింటును దర్శకుడు వంశీ పైడిపల్లి చూపించాడు. అప్పట్లో ఈ సినిమాలో తీసుకున్న మెయిన్ పాయింట్ పై ఎంతోమంది సినీ ప్రముఖులు … పొలిటికల్ లీడర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ఈ మూవీలోని మహేష్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి… విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

Advertisement

Advertisement

ఈ మూవీలో మహేష్ తర్వాత అంతగా పేరు వచ్చింది అంటే అది నరేష్ కే అని చెప్పవచ్చు. అప్పటివరకు కెరియర్లో వరస అపజాయాలను ఎదుర్కొంటున్న నరేష్ ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీలోని నరేష్ పాత్ర కోసం మొదటగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ ను దర్శకుడు వంశీ పైడిపల్లి అనుకున్నాడట. అందులో భాగంగా సాయి తేజ్ ను కూడా ఈ మూవీ యూనిట్ సంప్రదించగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీలో నటించలేను అని సాయి తేజ్ చెప్పినట్లు ఆ తర్వాత నరేష్ ను ఈ మూవీలో తీసుకున్నట్లు తీసుకున్నారట.

Visitors Are Also Reading