Home » మహేష్ కథతో మరో సినిమా చేయనున్న అల్లు అర్జున్..!

మహేష్ కథతో మరో సినిమా చేయనున్న అల్లు అర్జున్..!

by AJAY

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. అలా మహేష్ వదులుకున్న కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా… కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచాయి.

 

కొత్త కాలం క్రితం బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న పుష్ప మూవీ యొక్క కథను మొదట సుకుమార్… మహేష్ కే వినిపించాడట. కాకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల మహేష్ ఆ సినిమాలో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. దానితో సుకుమార్ ఈ కథను బన్నీ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.

 

ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇలా ఇప్పటికే ఒకసారి మహేష్ కోసం రూపొందిన కథలో బన్నీ నటించిన మరోసారి కూడా మహేష్ కోసం రూపొందిన మరో కథలో బన్నీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి మూవీతో అద్భుతమైన క్రేజ్ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ… మహేష్ తో ఒక మూవీ చేయాలి అని ఒక అద్భుతమైన కథను రెడీ చేసుకున్నాడట.

 

అలాగే ఆ మూవీకి “షుగర్ ఫ్యాక్టరీ” అదే టైటిల్ను కూడా ఫిక్స్ చేసుకున్నాడట. కాకపోతే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ చేస్తూ ఉండడం… ఆ తర్వాత రాజమౌళి మూవీకి కమిట్ అయి ఉండడంతో ఇప్పట్లో మహేష్ తో సినిమా కష్టం అని ఊహించిన సందీప్ ఇదే కథను బన్నీ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రెండోసారి మహేష్ కోసం రూపొందిన కథలో బన్నీ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading