Home » బలగం దర్శకుడితో బాలయ్య సినిమా..?

బలగం దర్శకుడితో బాలయ్య సినిమా..?

by AJAY
Ad

కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న కామెడీ పాత్రలలో నటించిన వేణు తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించాడు. అలా ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న కామెడీ పాత్రలలో నటించిన వేణు ఆ తర్వాత ఈటీవీలో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో లో టీం లీడర్ గా కొంతకాలం పాటు ఉన్నారు. ఈ కామెడీ షో ద్వారా వేణు ఎంతో మంది వెండితెర… బుల్లితెర ప్రేమికుల మనసు దోచుకున్నాడు.

 

Advertisement

ఇలా వెండితెరపై… బుల్లితెరపై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని అలరించిన వేణు తాజాగా బలగం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటించింది. పెద్దగా ఇలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను కూడా వసూలు చేసింది.

Advertisement

ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను వేణుకు ఎంతోమంది సినీ ప్రముఖుల నుండి… సినీ విశ్లేషకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బలగం మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వేణుకు అదిరిపోయే రేంజ్ మూవీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వేణు తన తదుపరి మూవీని నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే వేణు… బాలకృష్ణకు ఒక కథను వినిపించగా బాలయ్య కూడా ఆ కథకు సూపర్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.

Visitors Are Also Reading