నిరుద్యోగులకు శుభవార్త. 10వ తరగతి మొదలు ఎంబీఏ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు పొందే సదవకాశం. బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ ఎస్సీ, ఎస్టీ హాబ్ ఆఫీసుల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు ఇవే.
Advertisement
READ ALSO : గుండెపోటు ఉన్నవారు గుడ్డు తినవచ్చా… తింటే ఏమవుతుంది?
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 28 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Advertisement
* వీటిలో ఈ టెండరింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా 10వ తరగతి/బీటెక్/బిఈ/ బీకాం/ఐసిడబ్ల్యూఏ/ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
READ ALSO : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?
ముఖ్యమైన విషయాలు…
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్కిల్ టెస్ట్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నేలకు రూ.18,499 నుంచి రూ.50,000 జీతం గా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు మార్చి 24ని చివరి తేదీగా నిర్ణయించారు.
Advertisement
READ ALSO : Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?