Telugu News » Blog » Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?

Rana Naidu: ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ 30 ఏళ్ల కెరీర్ నాశనం అయ్యిందా?

by Bunty
Ads

విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అరంగేట్రం చేశారు వీరిద్దరూ. ఇందులో వెంకీ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు. నిజ జీవితంలో బాబాయ్, అబ్బాయిగా ఉన్న వీరు ఇందులో తండ్రి, కొడుకులుగా నటించారు. ఈ సిరీస్ లో రానా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా, నేరం చేసి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన క్రిమినల్ గా వెంకీ కనిపించాడు. అయితే ఈ సినిమా ఫ్యామిలీతో చూడాల్సినది కాదు. అన్ని ఆ సీన్లే ఉన్నాయి.

Advertisement

READ ALSO : ‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Advertisement

రానా నాయుడు ఓ బూతు సినిమా అని చెప్పవచ్చు. చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు చూసే సినిమా అసలు కాదు. ఇది ఇలా ఉండగా, విక్టరీ వెంకటేష్ అంటే ఓ ఫ్యామిలీ హీరో అని అందరికీ గుర్తుకు వస్తుంది. 60 ఏళ్ల వయసులో కూడా ఆయనకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. కానీ రీసెంట్ గా విడుదలైన రానా నాయుడు వెబ్ సిరీస్ చూస్తే 40 ఏళ్ల నుండి ఆయన సంపాదించుకున్న మంచి పేరు కాస్త చెడిపోయింది అనే భావన కలుగుతుంది.

READ ALSO : బుమ్రా సర్జరీ సక్సెస్..IPL లోకి ఎంట్రీ ?

Netflix's Rana Naidu is gritty drama packed with Rana-Venkatesh chemistry. But plot lacks meat

రానా, వెంకటేష్ కలిసి చేసిన ఈ సిరీస్ లో లెక్కలేనన్ని బూతులు ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఇంత దారుణమైన బూతు పదాలను ఎలా ఎంకరేజ్ చేశాడో అర్థం కాలేదు. పైగా ఇందులో కొడుకు పాత్రలో రానా నటించాడు. వెంకీ మామకి ఇలాంటి ఒక బూతు సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. కుటుంబంతో కలిసి ఈ సిరీస్ ని చూడడం జరిగే పని కాదు. ఈ సిరీస్ కి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ సిరీస్ వల్ల వెంకీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని అంటున్నారు.

Advertisement

READ ALSO : గుండెపోటు ఉన్నవారు గుడ్డు తినవచ్చా… తింటే ఏమవుతుంది?