Home » బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

by Sravya
Ad

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ లు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ 19 జనవరి 2024 నుండి ప్రారంభం అవ్వగా 10 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు మొత్తం 38 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ని పొందిన వాళ్లు అర్హులు. ఆర్మీ నేవీ వైమానిక దళంలో కనీసం ఐదేళ్లు కమిషన్ సర్వీస్ ఉన్న అధికారి అయ్యి ఉండాలి.

Advertisement

Advertisement

వయసు 29 నుండి 35 లోగా ఉండాలి రిజర్వ్డ్ క్యాటగిరి దరఖాస్తుదారులకి కూడా గరిష్ట వయోపరిమితులు సడలింపు ఇచ్చారు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాటగిరిలవారిగా చూసినట్లయితే జనరల్ 18, ఎస్సీ 5, ఎస్సీ రెండు, ఓబిసి 10 ఉన్నాయి అలానే ఈడబ్ల్యూబిసి కి మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ టెస్ట్, సైకో మెట్రిక్ టెస్ట్ ద్వారా సెక్యూరిటీ ఆఫీస్ పోస్ట్లు ని ఎంపిక చేస్తారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading