Home » బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్… ఆటగాళ్ల వయస్సు కోసం..?

బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్… ఆటగాళ్ల వయస్సు కోసం..?

by Azhar
Ad
క్రికెట్ లో వయస్సు మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మోసాలలో మన బీసీసీఐ అనేది ఆఖరి స్థానంలో ఉంటుంది. మన ఇండియా జట్టులో జరగవు అని కాదు.. కానీ మిగితా అన్ని దేశాల కంటే తక్కువగా జరుగుతాయి. కానీ ఈ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది మన శత్రు దేశం పాకిస్థాన్. అక్కడ ఈ రకమైన మోసాలు అనేవి చాలా జరుగుతాయి. ఇప్పటికే ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ పై ఈ ఆరోపణలు ఉన్నాయి. అయితే మన ఇండియాలో ఇవి తక్కువగా జరిగిన కూడా వాటిని అడ్డుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది.
అయితే ఈ కరమైన మోసాలు అనేవి ఎక్కువగా అండర్ 19 ప్రపంచ కప్ విషయంలో జరుగుతుంది. 19 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నవారు ఈ మోసాలకు పాల్పడి జట్టులో ఆడుతారు. ఇక గత ఏడాది ఈ అండర్ 19 ప్రపంచ కప్ సాధించిన మన భారత జట్టులోని రాజవర్థన్ హంగర్కేకర్ అనే ఆటగాడు ఇలాంటి మ్మోసానికి పాల్పడినట్లు అఆరోపణలు వచ్చాయి. అతడిని ఐపీఎల్ లో ఆడనివ్వదు అని అన్నారు. కానీ బీసీసీఐ వాటిని పెద్దగా పట్టించుకోకుండా.. అతడిని ఐపీఎల్ లోకి ఆమెమాతి ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇలాంటి ఆరోపణలకు కూడా ఆస్కారం అనేది లేకుండా ఆటగాళ్ల వయస్సు కోసం బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్ తెస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆటగాళ్ల వయస్సు అనేది తెలుసుకోవడానికి బీసీసీఐ… టీడబ్ల్యూ3 అనే పద్ధతిని వాడుతుంది. కానీ ఇందులో రిజల్ట్ అనేది రావడానికి నాలుగు రోజులు తీసుకోవడంతో పాటుగా… ఒక్కో పరీక్షకు రెండు వేల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు బీసీసీఐ ఈ విషయంలో బోన్‌ఎక్స్‌పర్ట్ సాఫ్ట్‌వేర్ ను తీసుకువస్తుంది. ఇక ఈ పద్దతిలో ఒక్కో పరీక్ష చేయడానికి 300 కంటే తక్కువ ఖర్చు వస్తుంది. అలాగే రికాల్ట్ కూడా ఒక్క గంటలో వచ్చేస్తుంది. అంధుల ఇకమీదట ఈ వయస్సును కనుకోవడానికి బీసీసీఐ ఈ పద్ధతినే వాడనునట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading