Home » ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త…!

ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త…!

by Azhar
Ad
రెండే ఏళ్ళ కింద వచ్చిన కరోనా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ వైరస్ కారణంగా అన్ని రంగాలతో పాటుగా క్రీడా రంగం కూడా చాలా నష్ట పోయింది. కానీ ఆ తర్వాత క్వారంటైన్ లో ఉండి.. రోజు కరోనా కరోనా టెస్టులు నిర్వహించి.. ఆ తర్వాత ఆటగాళ్లను బయో బబుల్ లోకి అనుమతిస్తూ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చెయ్యడం ఆటగాళ్లకు కష్టం అవుతుంది.
ఎందుకంటే.. ఒక్క సిరీస్ లో పాల్గొన ఆటగాళ్లు మళ్ళీ వెంటనే వేరే మ్యాచ్ ల కోసం లేదా ఇంకో జట్టుతో సిరీస్ కోసం మళ్ళీ బబుల్ లోకి వెళాల్సి వస్తుంది. ఇక మన భారత జట్టు ఆటగాళ్లు మాత్రం దాదాపు ఏడాది పొడవునా బబుల్ లోనే ఉంటున్నారు. ఒక్క సిరీస్ తర్వాత మరో సిరీస్.. ఇప్పుడు ఐపీఎల్ ఇలా బబుల్ లోనే గడిపేస్తున్న ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీం ఇండియా సౌత్ ఆఫ్రికాతో 5 టీ20 లలో పోటీ పడనుంది. అయితే ఈ సిరీస్ ను బీసీసీఐ బయో బబుల్ బయటనే నిర్వహించాలని అనుకుంటుంది. ఢిల్లీ, కటక్, వైజాగ్, రాజ్కోట్, బెంగళూరు వేదికలుగా జరిగే ఈ మ్యాచ్ లను కరోనా కేసులు కొంచెం తగ్గినట్లు అనిపిస్తే బయో బబుల్ లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటున్నాట్లు ఓ అధికారి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading