Home » ఐపీఎల్ ఫైనల్స్ లో అభిమానుల మోత..!

ఐపీఎల్ ఫైనల్స్ లో అభిమానుల మోత..!

by Azhar
Ad
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 2022 పైనే ఎక్కడ చుసిన చర్చ జరుగుతుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మన దేశంలో జరగని ఈ లీగ్ ఇప్పుడు తిరిగి మన ఇండియాలోనే బీసీసీఐ నిర్వహించడం అభిమానులకు ఆనదని కలిగించింది. ఆ వెంటనే ఐపీఎల్ మ్యాచ్ లకు 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తాని చెప్పి వారి ఆనందాన్ని మరింత పెంచేసింది.
ఇక ఐపీఎల్ మాస్క్ లు ప్రారంభమైన తర్వాత చెన్నై, ముంబై మినహా అన్ని జట్లు బాగానే రాణిస్తూ అభిమానులను ఆలరిస్తుండగా ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగు చూడటం బీసీసీఐ అలాగే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. దాంతో గత ఏడాదిలాగే మళ్ళీ ఐపీఎల్ వాయిదా పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బీసీసీఐ ఏ భయం లేకుండా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లను కొనసాగిస్తూ.. తాజాగా ప్లేఆఫ్ వేదికలను కూడా ఖరారు చేసింది.
కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో ప్లేఆఫ్‌స్ నిర్వహించనున్నట్లు తెలిపిన బీసీసీఐ.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. మే 24న క్వాలిఫైయర్ 1, మే 25న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పింది. అలాగే ఒకరోజు గ్యాప్ తో మే 27న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 … ఆ తర్వాత అక్కడే  మే 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని తెలిపింది. అయితే క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నట్లు చెప్పిన బీసీసీఐ.. ఫైనల్స్ కు 100 ప్రేక్షకులను అనుమతిస్తాం అని ప్రకటించింది. దాంతో ఈ ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో అభిమానుల మోత మోగనునట్లు అర్ధం అవుతుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading