Home » ఎన్టీఆర్ సినిమాపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. ‘నా టైటిల్ కొట్టేశారంటూ’..!

ఎన్టీఆర్ సినిమాపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. ‘నా టైటిల్ కొట్టేశారంటూ’..!

by Anji
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR వంటి సూపర్ హిట్ మూవీ తరువాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అన్ని పాన్ ఇండియా మూవీస్ చేయడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన  RRR తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇక రెమ్యునరేషన్ అమాంతం పెంచేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీకపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ప్రతినాయకుడి పాత్రలో హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తారక్ బర్త్ డే సందర్భంగా మే 19న సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించగానే ఈ సినిమా టైటిల్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. 

Advertisement

ఈ సినిమా టైటిల్ దేవర అని ఫిక్స్ చేసినట్టు గత కొద్ది రోజులుగా టాక్ వినిపించింది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ టైటిల్ అనుకున్నారట. కానీ ఆ సినిమాకు BRO అని ఫిక్స్ చేయడంతో.. ఎన్టీఆర్ మూవీకి దేవర అని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే “నా టైటిల్ కొట్టేశారంటూ.. నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దేవర అనే టైటిల్ తను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని.. అది నా టైటిల్ అంటూ వరుసగా ట్వీట్స్ చేశారు బండ్ల గణేష్. “దేవర”  నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. నా టైటిల్ నేను మరిచిపోవడం వల్ల నాటైటిల్ కొట్టేశారు” అని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్ది సేపటికీ నాకు ఏం ప్రాబ్లం లేదు.. బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమానే కదా.. ఆయన కూడా నాకు దేవరే.. అంటూ మరో ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Bro : బ్రో థీమ్ సాంగ్ కాపీయా? తమన్ పై ట్రోలింగ్?

Agent : అఖిల్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌… ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌ వాయిదా

రాధేశ్యామ్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Visitors Are Also Reading