Home » రాధేశ్యామ్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

రాధేశ్యామ్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

by Bunty
Ad

ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య గత ఏడాది థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమా చాలామందిని నిరాశపరిచింది.

Advertisement

ఈ సినిమా పీరియాడికల్ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పామిస్ట్రీ నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. దాంతో సినిమాలో ఫ్యాన్స్ ఆశించిన మేర మాస్ సీన్లను చిత్రించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ కోసం రాసింది కాదట. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం ఈ సినిమాను దర్శకుడు సిద్ధం చేసుకున్నాడని సమాచారం అందుతుంది.

Advertisement

ఈ రాధేశ్యామ్ కథను మొదటగా విక్టరీ వెంకటేష్ కు దర్శకుడు చెప్పారట. అయితే అప్పటికే విక్టరీ వెంకటేష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఈ రాధేశ్యామ్ సినిమాను వెంకటేష్ వదులుకున్నారని తెలుస్తోంది. దాంతో రాధేశ్యామ్ దర్శకుడు… నేరుగా ప్రభాస్ వద్దకు వెళ్లాడట. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో ప్రభాస్ ఓకే చెప్పారని టాక్. కానీ ఈ సినిమా ప్రభాస్ కు నిరాశే మిగిల్చింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

Visitors Are Also Reading