Home » Agent : అఖిల్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌… ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌ వాయిదా

Agent : అఖిల్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌… ‘ఏజెంట్‌’ స్ట్రీమింగ్‌ వాయిదా

by Bunty
Ad

అఖిల్ అక్కినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్‌ లో అడుగు పెట్టినప్పటి నుంచి సరైన విజయం లేక.. సతమతమౌవుతున్నాడు అఖిల్ అక్కినేని. అయితే.. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Advertisement

టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విడుదలైన రోజు నుంచి ఏజెంట్ కి ఫ్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి జనాలు థియేటర్ కి వెళ్లడం మానేశారు. గత సినిమాలతో పోల్చితే అఖిల్ పెర్ఫార్మన్స్ పర్వాలేదనిపించిన కథలో ఎలాంటి ఎమోషన్ లేకపోవడంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సైతం ఈ మూవీ నుంచి సేవ్ చేయలేకపోయారు.

Advertisement

కాగా, ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం కేవలం 6.50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కాగా, అఖిల్ ఏజెంట్ మూవీ మే 19న సోనీలివ్ ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. శుక్రవారం సోనీలివ్ లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా ఈనెల 25 తర్వాత రిలీజ్ అవుతుందని సమాచారం అందుతోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

రాధేశ్యామ్ సినిమాను వదులుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

నాకు వెన్నుపోటు పొడిచారు : శ్యామల సంచలనం

Visitors Are Also Reading