Home » Bro : బ్రో థీమ్ సాంగ్ కాపీయా? తమన్ పై ట్రోలింగ్?

Bro : బ్రో థీమ్ సాంగ్ కాపీయా? తమన్ పై ట్రోలింగ్?

by Bunty
Published: Last Updated on
Ad

పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. అటు రాజకీయాల్లోనూ ఇటు చిత్ర పరిశ్రమలోను దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాకు బ్రో అనే శీర్షికను ప్రకటించింది చిత్రబృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అలాగే ఈ సినిమా నుంచి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ థీమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

Advertisement

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ముఖ్యంగా ఈ థీమ్ సాంగ్ కు పవన్ అందించిన బిజిఎం ఆహా.. ఓహో.. అంటూ పొగిడేసారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ ను కూడా తమన్ కాపీ చేశాడంటూ ట్రోలింగ్ జరుగుతుంది. అక్షయ్ కుమార్ బ్లూ మూవీలో నుంచి ఈ బ్రో సాంగ్ కాపీ చేసినట్టు ఆరోపిస్తున్నారు. ఆ సాంగ్ లో ఉన్న బ్లూ అనే పదాన్ని తీసేసి బ్రో పెట్టడం తప్ప మిగతా మార్పులు ఏమీ లేవని… మక్కీకి మక్కి దింపేసారని థమన్ ను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.

 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్యతో హనీమూన్ ట్రిప్, 10 లక్షలు డిమాండ్…. ఆ ఫోటోలతో భర్త దారుణం!

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? డైరెక్టర్ సర్ ‘ఆది పురుష్’ పోస్టర్ లో మిస్టేక్ గమనించారా?

ఆ ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ… కృతిశెట్టి క్లారిటీ!

Visitors Are Also Reading