Home » డిఫెండింగ్ ఛాంపియన్ కి భారీ షాక్.. 69 పరుగుల తేడాతో గెలిచిన అప్గాన్..!

డిఫెండింగ్ ఛాంపియన్ కి భారీ షాక్.. 69 పరుగుల తేడాతో గెలిచిన అప్గాన్..!

by Anji
Ad

ప్రపంచ కప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లు జరిగాయి. దిగ్గజ ఆస్ట్రేలియా జట్టు భారత్ పై ఓడిపోయింది. అదేవిధంగా భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. అప్గాన్ మొన్న ఓడిపోయినప్పటికీ.. తాజాగా పుంజుకొని డింపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

Advertisement

ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో అతి పెద్ద ఎదురుదెబ్బ ఆదివారం జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో 14 వరుస పరాజయాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని నమోదు చేసింది. 2019 ఛాంపియన్‌లను ఓడించింది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ జట్టు 215 పరుగులకే ఆలౌటైంది.

అఫ్గానిస్థాన్ స్పిన్నర్లు గేమ్ ఛేంజర్‌లుగా నిలిచి మొత్తం 8 వికెట్లు పడగొట్టారు. ముజీబ్, రషీద్ చెరో 3 వికెట్లు తీయగా, మహ్మద్ నబీ 2 వికెట్లు తీశారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టు 5వ సారి పరాజయం పాలైంది. అంతకుముందు 1992లో జింబాబ్వే చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2011లో ఆ జట్టు ఐర్లాండ్‌తో 3 వికెట్ల తేడాతో, బంగ్లాదేశ్‌తో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2015లో కూడా బంగ్లాదేశ్ జట్టుపై 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా 2023లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ 5వ సారి ప్రపంచకప్‌లో భారీ షాక్ ఇచ్చింది. అంతే కాదు టీ-20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో రెండుసార్లు ఓడి ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డులను నమోదు చేసింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Muhammad Rizwan : రిజ్వాన్ పై ట్రోలింగ్.. జై శ్రీరామ్ అంటూ !

 Rohit Sharma : తన కండలతో ఎంపైర్ ను బెదిరించిన రోహిత్ శర్మ !

Visitors Are Also Reading