Home » Rohit Sharma : తన కండలతో ఎంపైర్ ను బెదిరించిన రోహిత్ శర్మ !

Rohit Sharma : తన కండలతో ఎంపైర్ ను బెదిరించిన రోహిత్ శర్మ !

by Bunty
Ad

కొంతమంది ఆటగాళ్లు ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చి క్రీజులో నిలదొక్కుకున్నారంటే ఇక ప్రత్యర్ధులకి చుక్కలు చూపిస్తారు. క్రికెట్ లో అలాంటి ఆటగాళ్లలో ముందుగా వినిపించేపేరు రోహిత్ శర్మ. ఇప్పుడు టెర్రిపిక్ టచ్ లోకి రావడంతో మన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆఫ్గాన్ పై సెంచరీ చేశాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా అదరగొట్టారు. మరో సెంచరీని మిస్ చేసుకున్నాడు అన్నమాటే కానీ కంప్లీట్ డామినేషన్. ఎక్కడ అడ్డదిడ్డమైన బాదుడు లేదు.

Advertisement

కంటికి ఇంపుగా, చాలా స్టైలిష్ గా ఆడాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 63 బాల్స్ లోనే 86 స్కోర్ చేశాడు. ఈ విన్నింగ్ లో ఓ సరదా సంఘటన కూడా జరిగింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో రోహిత్ శర్మ సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ ని చూస్తు స్టనైపోయిన పోయిన అంపైర్ ఎరాస్మస్ అలా ఎలా కొట్టావ్ అంటూ అన్నట్టుగా రోహిత్ వైపు చూశాడు. కండల పవర్ అని అర్థం వచ్చేలా అప్పుడు రోహిత్ తన బైసెప్స్ చూపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది.

Advertisement

తెలుగు ఫ్యాన్స్ అయితే సరదాగా బ్రహ్మానందం మీమర్ తో పోలుస్తున్నారు. మజిల్ చూసావా చూడు అని అతడు సినిమాలో బ్రహ్మానందం అన్నట్టుగా రోహిత్ కూడా ఫోజ్ ఇచ్చాడని సరదాగా మీమ్స్ చేస్తున్నారు. మొత్తం మీద మూడు మ్యాచుల్లో మూడు విజయాలను సాధించాడు. జట్టులోని ప్రతిఒక్కరూ కంట్రిబ్యూట్ చేస్తూ ఉండడం, టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ లో అదిరిపోయే ఆరంభం దక్కింది.ఇక నిన్న పాకిస్థాన్ జట్టు పై 7 వికెట్ల తేడాతో ఇండియా కు దక్కింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading