Home » గ్రీన్ టీలో వీటిని యాడ్ చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!

గ్రీన్ టీలో వీటిని యాడ్ చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!

by Anji

సాధారణంగా చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. వేడి వేడిగా పొగలు వచ్చే చాయ్ గొంతు దిగకపోతే ఆ రోజు అంతా ఏదోలా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు. టీ అనేది జస్ట్ టైమ్ పాస్ వరకేనా అటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. టీలో కూడా పలు ప్లేవర్లను యాడ్ చేసి ఆరోగ్యంగా మార్చుతున్నారు. అలా వచ్చిందే… గ్రీన్ టీ. ప్రపంచ వ్యాప్తంగా గజగజ వణికిస్తున్న వ్యాధుల్లో గుండెపోటు, క్యాన్సర్ రెండో స్థానంలో ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్  టీ తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

వారి సూచనల ప్రకారం.. పాలు, పంచదార, టీ ఆకుల్లో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తుంది. హెర్బల్ టీని తాగడం వల్ల బరువు తగ్గతారు. అయితే గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే.. దీని ప్రయోజనాలు రెట్టింపు స్థాయిలో పెరుగుతాయి. వంటకాల్లో మసాలా దినుసుగా ఉపయోగించే అల్లం.. ఆహారం రుచిని పెంచుతుంది. గ్రీన్ టీలో అల్లం కలిస్తే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అల్లంతో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. కొంతమంది గ్రీన్ టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్కను కలుపుకొని తాగుతుంటారు. ఎందుకంటే ఇది శరీరం ఇమ్యూనిటి పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  

Also Read :  హైదరాబాద్ కు దూరంగా వెళ్ళిపోతున్న సమంత….కారణం అదేనా…?

నిమ్మకాయను గ్రీన్ టీలో కలిపి తీసుకుంటే.. రుచి కొద్దిగా మారుతుంది. ఈ రెండు కాంబినేషన్ మీ శరీరానికి మేలు చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్లను పెంచడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్టివియాను తెలుగులో మధుప్రతి అని అంటారు. గ్రీన్ టీలో కలిపితే తీపి యాడ్ అవుతుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకొంటే క్యాలరీలు తగ్గడమే కాకుండా.. రక్తంలో చక్కర స్థాయి కూడా తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 

Also Read :  వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 100 మీడియాలు షేర్ చేయవచ్చు..!

Visitors Are Also Reading