Home » వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 100 మీడియాలు షేర్ చేయవచ్చు..! 

వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 100 మీడియాలు షేర్ చేయవచ్చు..! 

by Anji
Ad

వాట్సాప్ కి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యాప్ అత్యధిక యూజర్లను సొంతం చేసుకుంది. యూజర్లకు ఎప్పటికప్పుడూ బెస్ట్ ఫీచర్లను అందిస్తూ.. మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నాలలో ఉంది. ఇటీవల కాలంలో వరుసగా అప్ డేట్ లను విడుదల చేస్తోంది. తాజాగా వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ బీటాలో చాట్ లలో గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసేవిధంగా కొత్త ఫీచర్ ని వాట్సాప్ అందించింది. లెటెస్ట్ అప్ డేట్ కి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

WABETALNFO నివేదిక ప్రకారం.. సరికొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు యాప్ లోని మీడియా పికర్ ద్వారా గరిష్టంగా 100 మీడియాలను షేర్ చేసే అవకావం కలుగుతుంది. ఇంతకుముందు మీడియా పికర్ పీచర్ కి 30 మీడియాలను యాడ్ చేసే ఆప్షన్ మాత్రమే ఉండేది. త్వరలో వినియోగదారులు అందరికీ లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత 100 మీడియాలను షేర్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ ల కోసం గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో వచ్చింది. 2.23.4.3 వెర్షన్ డౌన్ లోడ్ చేసుకున్న వినియోగదారులను చాట్ లో ఒకేసారి 100 మీడియాను షేర్ చేసే ఆప్షన్ వస్తుంది. వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు మొత్తం ఆల్బమ్ ని కాంటాక్ట్స్ తో పంచుకోగలుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో జ్ఞాపకాలు, క్షణాలను షేర్ చేసుకునే సదుపాయం కలుగుతుందని WABETALNFO పేర్కొంది. అంతేకాదు.. మీడియా ఫైల్స్ ని ఒకేసారి పంపేటప్పుడు వినియోగదారులు ఒకే ఫోటో లేదా వీడియోని రెండు సార్లు షేర్ చేయకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. 

Advertisement

Also Read :   ఉపవాస సగ్గుబియ్యంను వేటితో.. ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ? 

వాట్సాప్ మరో అప్డేట్ ని అందించే ప్రయత్నాలలో కూడా ఉంది. యూజర్లు వాట్సాప్ లో గ్రూపు సబ్జెక్ట్, డిస్క్రిప్షన్  ద్వారా క్యారెక్టర్ లిమిట్ ని పెంచే ప్రయత్నాలలో ఉంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కి ఈ అప్ డేట్ అందించనుంది. కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్ ఉద్దేశం, నియమాలు, చర్చనీయాంశాలు తదితర వివరాలను గ్రూపు సభ్యులకు వివరించే అవకాశముంటుంది. మెరుగుపరచడానికి ప్లాట్ ఫారంలో ఒకరితో ఒకరు కనెక్ట్ కావడాన్ని సులభతరం చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ బీటా అప్డేట్ ని ఇన్ స్టాల్ చేసిన తరువాత వినియోగదారులు ఈ ఫీచర్ ని ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఈ అప్ డేట్ దశలవారిగా అందుబాటులోకి రానుంది. 

Also Read :  భోజనం తరువాత అరటిపండును తినవచ్చా..? తింటే ఏమవుతుందంటే..?

Visitors Are Also Reading