Home » ఇండియా నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇస్తున్న..!

ఇండియా నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇస్తున్న..!

by Azhar
Ad

ఏబీ డివిలియర్స్ సౌత్ ఆఫ్రికాకు చెందిన క్రికెటర్. కానీ ఈయన పేరును ఇక్కడ మన ఇండియాలో కూడా ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అనేది లేదు. ఐపీఎల్ లో ఆడిన ఏబీ డివిలియర్స్ కు ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అయితే 2021 ఐపీఎల్ తర్వాత ఏబీ డివిలియర్స్ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. కానీ ఇక్కడ తనకు లభించిన ప్రేమను మాత్రం మర్చిపోలేదు.

Advertisement

అందుకే తనకు ఎంతో ప్రేమ అనేది ఇచ్చిన ఇండియా కోసం ఏదైనా చేయాలి అని ఓ గొప్ప కార్యక్రమం అనేది ప్రారంభించాడు. అందుకోసం మన ఇండియాలో ఉన్న ‘మేక్ ఏ డిఫరెన్స్’ అనే ఎన్జీవోతో కలిసాడు. అయితే ఈ ‘మేక్ ఏ డిఫరెన్స్’ అనే ఎన్జీవో ఇక్కడ స్వచందంగా నడిచే ఓ ఎన్జీవో. ఇది 10 నుండి 28 ఏళ్ళ మధ్య గల వారి యొక్క ఆర్ధిక ఇబ్బందులు అనేది దూరం చేయడానికి పని చేస్తుంది. వారికి చదువులో .. లైఫ్ లో స్థిరపడటంలో సహాయం చేస్తుంది.

Advertisement

ఇక ఈ ఎన్జీవోతో కలిసిన డివిలియర్స్ కూడా ఇద్దరిని దత్తత తీసుకున్నాడు. లక్నోకు చెందిన 18 ఏళ్ల ఓ యువ క్రికెటర్ తో పాటుగా… బెంగళూరులోని 21 ఏళ్ల జర్నలిజం విద్యార్థి యొక్క బాధ్యత అనేది తీసుకున్నాడు. వారు తమ లక్ష్యాలు చేరుకునే వరకు వారికీ తన సహాయం అనేది అందిస్తాను అని డివిలియర్స్ పేర్కొన్నాడు. అయితే ఇండియా తనకు ఇచ్చిన దానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఈ పని అనేది చేస్తున్న డివిలియర్స్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన అతని మేనేజర్..!

మళ్ళీ బ్యాట్ పట్టనున్న గౌతమ్ గంభీర్..!

Visitors Are Also Reading