Home » ‘చాలా బాగున్నావు.. మనం పెళ్లి చేసుకుందామా’ అంటూ వల.. చిక్కిన వారు విలవిల..!

‘చాలా బాగున్నావు.. మనం పెళ్లి చేసుకుందామా’ అంటూ వల.. చిక్కిన వారు విలవిల..!

by Anji
Ad

ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.31లక్షల 66 వేల రూపాయలు లూటీ చేసిన ఒక కిలాడి టిక్ టాకర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

Also Read:  అయ్యప్ప స్వామికి కన్నె స్వాములు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ?

Advertisement

 

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు దఫాలుగా ఎనిమిది నెలల కాలంలో రూ.31, లక్షల 66 వేల రూపాయలు కొల్లగొట్టింది. ఆమె తతంగం గురించి ఓ యువకుడు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక యువకుడు పోలీసులు రంగంలోకి దిగి ఫిర్యాదు మీద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. మచిలీపట్టణానికి చెందిన పరసా తను శ్రీ సోషల్ మీడియాలో టిక్ టాక్ షోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. టిక్ టాక్ బాన్ అయిన తరువాత ఇన్ స్టాగ్రామ్ లో కూడా పలు పాటలకు లిప్ సింక్ వీడియోలకు పర్ఫామెన్స్ లు ఇస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వచ్చింది. Sritinsu, sri.tinsu, sri_tinsu, lucky_sritinsu అనే నాలుగు అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఆమె రెచ్చిపోయింది. అందమైన ఫోటోలను షేర్ చేయడంతో ఆమె అందానికి ఫిదా అయిన వారు కామెంట్స్ పెడితే వెంటనే వారికి మీరు కూడా నాకు నచ్చారు. పెళ్లి చేసుకుందామా ? అంటూ మాటలు కలిపేది.

Advertisement

Also Read:  సౌంద‌ర్య వెంక‌టేష్ ల మ‌ధ్య అలాంటి రిలేష‌న్షిప్ ఉండేదా..? వెంక‌టేష్ ను ఏమ‌ని పిలిచేవారంటే..?

Manam News

అలా వారి మధ్య మాట కలిపి ఒక వ్యక్తితో ఏకంగా రూ.33లక్షల 66వేలు అకౌంట్ లో వేయించుకుంది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని.. తన ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రి ఖర్చుల కోసం అవసరం ఉందని మాయ మాటలు చెప్పి డబ్బులను కాజేసింది. వాస్తవానికి ఆమె మరో వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంటూ లగ్జరీ జీవితానికి అలవాటు పడింది. ఆ ఖర్చులను ఇలా పలువురు దగ్గరి నుంచి తన పార్ట్ నర్ రాబట్టినట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఆమెను, ఆమెకు సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఒక్కరి వద్దనే కాదని.. తనను పెళ్లి చేసుకుంటానని కామెంట్స్ పెట్టిన పలువురి వద్ద నుంచి తాను డబ్బులు కాజేసినట్టు ఒప్పుకుంది. ముఖ్యంగా అబ్బాయిలు అలెర్ట్ గా ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరైనా పెళ్లి చేసుకుంటానని కామెంట్స్ చేస్తే పొంగిపోయి రిప్లై ఇవ్వకండి. ఇలాంటి వారి చేతిలో మోసపోయే ప్రమాదముంది జాగ్రత్తగా ఉండండి.  

Also Read :  మీ వివాహ బంధంలో అస్సలు చేయకూడని తప్పులు..!!

Visitors Are Also Reading