Home » అయ్యప్ప స్వామికి కన్నె స్వాములు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ?

అయ్యప్ప స్వామికి కన్నె స్వాములు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ?

by Anji
Ad

ప్రపంచ వ్యాప్తంగా అయ్యప్పస్వామికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ ఆలయంలో ఉన్న స్వామిని అప్పయ్యగా కొలుస్తారు. అయ్యప్ప పేరులో అయ్య అనగా  విష్ణువు అని, అప్ప అంటే శివుడు అని అర్థం. విష్ణు అవతారం మోహిని, శివుడి కలయిక వల్ల జన్మించాడు కాబట్టి అయ్యప్ప అని పేరు వచ్చింది. ఈయనను హరిహరసుతుడు. మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు. అయ్యప్ప స్వామి మాలదరణ వేసుకున్న వారిలో కన్నెస్వాములను ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఎందుకనగా అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే చాలా ఇష్టం. అయ్యప్పకు కన్నె స్వాములు అంటేనే ఎందుకు అంత ప్రీతి అనే విషయాలను మనం తెలుసుకుందాం. 

అయ్యప్ప స్వామి దీక్షలో కన్నె స్వామి అంటే ఎవరు గురుస్వామి అంటే ఎవరు  తెలుసుకుందాం|ayyappa swamy - YouTube

Advertisement

తొలిసారిగా అయ్యప్ప మాలదరణ వేసుకున్న భక్తులను కన్నెస్వాములుగా పిలుస్తారు. అయ్యప్ప స్వామికి కన్నెస్వాములు అంటే ఇష్టం అనడానికి ఓ కథ ఉంది. పురాణాల్లోకి వెళ్లితే.. దత్తాత్రేయుడి భార్య లీలావతి ఓ శాపంతో మహిాషాసురుడి సోదరి మహిషాసిగా జన్మించింది. ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుడి, లోకమాత సంహరించడంతో తన అన్నను చంపినందుకు గాను దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని గోర తపస్సు చేసి శక్తులను పొంది ప్రజలను పీడించసాగింది. దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా జన్మించి, మహిషిని సంహరిస్తాడు. దీంతో ఆమెకు శాపవిమోచనం లభిస్తుంది. దీంతో ఆమె అయ్యప్పస్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఆమె కోరికను విన్న అయ్యప్పస్వామి తిరస్కరిస్తాడు.

Advertisement

అయినప్పటికీ ఆమె పట్టు విడవకపోవడంతో తన మాల వేసుకొని 41 రోజులు దీక్ష చేసిన కన్నెస్వామి తన దర్శనానికి రానప్పుడు తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలను కుచ్చుతారు. అక్కడ ఎప్పుడైతే ఒక్కబాణం కూాడా కనిపించదో అప్పుడు పెళ్లాడుతానని చెబుతాడు. అంతేకాదు.. శబరి కొండల్లో నీవు పురోత్తమగా పూజలు అందుకుంటావని తెలిపారు. దీనికి అర్థం కన్నస్వామిల రాక ఎప్పటికీ ఆగదని చెప్పవచ్చు. ఎందుకంటే అయ్యప్ప బ్రహ్మచారి అవతారం. దీనిలో భాగంగానే శబరిమలకు వచ్చిన కన్నె స్వాములు ఎరిమేలి నుంచి తీసుకొచ్చిన బాణాలను శరీరం గుత్తిలో గుచ్చుతారు. అందుకే ఎక్కడికీ వెళ్లినా అయ్యప్ప భక్తుల్లో కన్నెస్వాములకు ప్రాధాన్యత అంత ఉంటుంది. 

Also Read :  Uday Kiran: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్ అందులో ఏముందంటే ?

Visitors Are Also Reading