Home » బాలయ్య, రజినీ, శివరాజ్ కుమార్ లతో మల్టీస్టారర్ మూవీ.. ఎప్పుడంటే ?

బాలయ్య, రజినీ, శివరాజ్ కుమార్ లతో మల్టీస్టారర్ మూవీ.. ఎప్పుడంటే ?

by Anji
Ad

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి త్వరలోనే ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. ఈ సినిమా కేజీఎప్ తరహాలో రెండు పార్ట్ లుగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో ఎన్ని మల్టీస్టారర్ మూవీస్ చేసినా ఇంత క్రేజ్ మాత్రం లేదనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చాలానే చేశారు.  

Advertisement

ఈ మూవీస్ కి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం కథ బాగుంటే కలిసి నటించేందుకు సై అంటున్నారు. బాహుబలి, RRR వంటి సినిమాలతో దక్షిణ భారత చలనచిత్ర రంగంలోనే మంచి ఊపందుకున్నాయి మల్టీ స్టారర్ మూవీస్. ఆర్ఆర్ఆర్ కంటే ముందు టాలీవుడ్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్ 2 వంటి మల్టీస్టారర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్, భీమ్లానాయక్ లో పవన్, రానా కలిసి నటించారు. పవన్ కళ్యాణ్ తరువాత చిత్రం బ్రో కూడా మల్టీస్టారరే కావడం విశేషం. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ సలార్ మూవీలో నటిస్తున్నారు.

Advertisement

ఈ క్రాస్ ఓవర్ స్టార్ సినిమాల ట్రెండ్ ని బాలయ్య మరో రేంజ్ కి తీసుకెళ్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, నటసింహం బాలకృష్ణ మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీని కన్నడ దర్శకుడు తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో శివరాజ్ కుమార్ తో కలిసి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్, తెలంగాణలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు శివరాజ్ కుమార్ హాజరయ్యారు. వారితో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నందుకే బాలయ్య వీరిద్దరినీ ఆహ్వానించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మల్టీస్టారర్ మూవీ గురించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Visitors Are Also Reading